Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
Bus Rape Case | ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్రంతో పాటు ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలను నిలదీశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీ వరకు బస్సు పలు కిలోమీటర్లు ప్రయాణించినా.. మార్గమధ్యంలో ఎక్కడా తనిఖీలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.
Bus Rape Case | ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్రంతో పాటు ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలను నిలదీశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీ వరకు బస్సు పలు కిలోమీటర్లు ప్రయాణించినా.. మార్గమధ్యంలో ఎక్కడా తనిఖీలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. మహిళలు, బాలికల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాహుల్‌గాంధీ స్పందించారు. గ్రేటర్ నోయిడా-దిల్లీ మధ్య ప్రయాణించిన స్లీపర్ బస్సు నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ రింగ్‌రోడ్, సరిహద్దు ప్రాంతాలను దాటినా.. ఎక్కడా తనిఖీ చేయకపోవడంపై ఆయన ప్రశ్నలు సంధించారు.
తెరల మాటున ఏం జరుగుతోందో తెలియదా?
స్లీపర్ బస్సుల్లో సీట్ల చుట్టూ ఏర్పాటు చేసే తెరల కారణంగా లోపల ఏం జరుగుతోందో బయట నుంచి కనిపించదని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. 2012లో నిర్భయ ఘటన అనంతరం స్లీపర్ బస్సుల పర్యవేక్షణ, తనిఖీలకు సంబంధించిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బస్సులోని తెరలు ఘటనను దాచేందుకు మాత్రమే కాకుండా.. పాలనా వ్యవస్థ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నానికి ప్రతీకగా మారాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో దిల్లీ పోలీసులతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల బాధ్యతపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
జవాబుదారీతనం ఉండాలి
ఈ ఘటనకు ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు బాధ్యత వహించేలా చర్యలు ఉంటాయా? అని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. మహిళలు, బాలికలకు సురక్షిత ప్రయాణం కల్పించాలంటే వ్యవస్థాగత సంస్కరణలు అత్యవసరమని అన్నారు. స్లీపర్ బస్సుల తనిఖీలు, పర్యవేక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు కేంద్ర, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీతనం నిర్ధారించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సైతం స్పందించింది. ఘటనను సుమోటోగా పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వర్షం.. చీకటిలో బస్సెక్కిన బాలిక
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 16 ఏళ్ల బాలిక నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. ఆగస్టు 4 రాత్రి భారీ వర్షం, చీకటి సమయంలో గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ సమీపంలో స్లీపర్ బస్సు ఎక్కింది. పరిచౌక్ నుంచి నోయిడా సెక్టార్-63 మధ్య ప్రయాణిస్తుండగా తనపై అత్యాచారం జరిగినట్లు బాలిక ఆరోపించింది. అనంతరం ఆమెను ఢిల్లీలోని కశ్మీరీగేట్ ప్రాంతం సమీపంలో దించేసినట్లు పేర్కొంది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు చేయించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బస్సును గుర్తించి.. డ్రైవర్, కండక్టర్‌ను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ఆమెను తండ్రికి అప్పగించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
సెప్టెంబర్ 13, 2026

Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
సెప్టెంబర్ 13, 2026

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
- ●Sirikonda Madhusudanachary | ఆరు రోజుల్లో ఏ ఒక్క షార్ట్ డిస్కషన్ సరిగా జరగలే
- ●BRICS Summit New Delhi | బ్రిక్స్ సదస్సులో భారత్ దౌత్య విజయం: పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య మోదీ.. 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు సర్వసమ్మతి

Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు

TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ



