Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారాయి.
Khairatabad Ganesh | త్రినేత్ర.న్యూస్ : ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. నలుదిక్కులా కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మహాగణపతిని దర్శించుకుని, తన్మయత్వం చెందుతున్నారు.
శనివారం ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తొక్కిసలాటకు ఏ మాత్రం అవకాశం లేకుండా భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు.
నిన్న ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో.. పలువురు భక్తులు క్యూలైన్లలోనే సొమ్మసిల్లిపోయారు. అందుబాటులో ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కొందరు జనం ఒత్తిడితో ఉండలేక బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారికి సహకరించారు. చాలా మంది మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో వస్తుండటంతో ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి మండపం వచ్చే దారిలో రద్దీ బాగా పెరిగింది.
తాజావార్తలు
- ●DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు
- ●Horoscope | సెప్టెంబర్ 20 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
- ●యూపీఐకి బడ్జెట్ పెట్టలేరా?.. ప్రజల లావాదేవీలే ఆదాయ వనరా?
- ●Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!
- ●CM Revanth Reddy | విద్యార్థుల యూనిఫాంలలో కొత్త డిజైన్లు.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- ●Brahmotsavam | వైభవంగా గరుడ సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు

DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు

Horoscope | సెప్టెంబర్ 20 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?

యూపీఐకి బడ్జెట్ పెట్టలేరా?.. ప్రజల లావాదేవీలే ఆదాయ వనరా?

Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!






