త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Plastic Chair | కుర్చీలంద‌రూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేర‌యా..! వైర‌ల్ వీడియో

Plastic Chair | గ్రామాల్లోకి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేందుకు వ‌చ్చే వారు కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటారు. అందులో ప్లాస్టిక్ కుర్చీల‌ను కొనాలంటే సాహ‌సం చేయ‌రు. ఎందుకంటే అవి త్వ‌ర‌గా విరిగిపోయే ప్ర‌మాదం ఉంటుందని. కానీ ఓ విక్ర‌యదారుడు మాత్రం కుర్చీలంద‌రూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేర‌యా అని చాటిచెప్పేందుకు.. ఏకంగా ఆ చైర్‌పై నిల‌బ‌డి డ్యాన్స్ చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

S

National | Published On Sep 20, 2026, 7.48 am IST

Plastic Chair | కుర్చీలంద‌రూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేర‌యా..! వైర‌ల్ వీడియో
Advertisement

Plastic Chair | త్రినేత్ర‌.న్యూస్ : సాధార‌ణంగా ప్లాస్టిక్ కుర్చీల‌ను విక్ర‌యించేవారు.. ఎన్నో పాట్లు పడుతుంటారు. అంద‌రి ముందే దాని సామ‌ర్థ్యాన్ని తెలియ‌జేసే విధంగా.. నేల‌కేసి కొడుతుంటారు. జిమ్నాస్టిక్ మాదిరి ఆ చైర్‌ను అటుఇటు మ‌డుస్తుంటారు. అయినా అది విర‌గ‌దు.. దాంతో కొనుగోలుదారులు కూడా ఆ ప్లాస్టిక్ చైర్‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అయితే విక్ర‌యదారుడు మాత్రం ఓ ఆకు ఎక్కువే చ‌దివాడు. క‌స్ట‌మ‌ర్ల దృష్టిని ఆక‌ర్షించేందుకు ఏకంగా చైర్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేశాడు. త‌న కాళ్ల‌తోనే చైర్‌ను ముందుకు క‌దిపాడు. అయినా కూడా విర‌గ‌లేదు.. బెణ‌క‌లేదు.. కుర్చీలంద‌రూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేర‌యా అని ఆ విక్ర‌య‌దారుడు నిరూపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి.. కడుపుబ్బా నవ్వుకోండి..

Advertisement
Advertisement