Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో
Get together | మీ బాల్యం మీకు గుర్తుకు వస్తుందా.. అది కూడా స్కూల్ డేసా.. ఇంకేముంది.. ఈ వృద్ధుల మాదిరి మీరు కూడా కిడ్స్‌గా మారిపోండి.. ఐదారేండ్ల స్కూల్ డేస్( School Days )ను ఒక్క రోజు నెమరేసుకోండి.. 1976 బ్యాచ్‌కు చెందిన గెట్ టు గెదర్( Get together ) వీడియో చూస్తే మీకు కూడా గత స్మృతులు గుర్తుకు రాక తప్పదు.
Get together | త్రినేత్ర.న్యూస్ : ఇటీవలి కాలంలో చాలా మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని గత స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. నాటి జ్ఞాపకాల్లో తేలియాడిపోతున్నారు.. ఆనాటి సంతోషాలను, ఆటలను నెమరేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ఎన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే దాదాపు ఐదారు తరగతుల నుంచి పదో తరగతి వరకు అంటే ఓ ఆరేండ్ల పాటు కలిసి ఉండడం. ఇది మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నో అల్లరి, చిలిపి చేష్టలను గుర్తు చేస్తుంది.
అందరి లాగే.. 1976కు చెందిన ఓ బ్యాచ్.. ఇటీవల గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంది. అంటే ఈ బ్యాచ్ వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. ముసలితనంలో ఉన్న వారంతా.. ఒక రోజంతా కిడ్స్‌గా మారిపోయారు. తమ స్కూల్‌డేస్‌ను ఫాలో అయ్యారు. నాటి స్కూల్ డ్రెస్ మాదిరి దుస్తులనే ధరించారు. బ్యాగులు వేసుకుని, వాటర్ బాటిల్స్‌తో స్కూల్ గేటు ఓపెన్ చేసుకుని పరుగెత్తుకుంటూ తమ గ్రౌండ్‌లో వాలిపోయారు. ఐదు దశాబ్దాల క్రితం వారు ఆడిన ఆటలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆటలాడారు. చుక్ చుక్ రైలు ఆట, గోనెబిళ్ల ఆటతో పాటు పలు ఆటలను సరదాగా ఆడిపాడారు. ప్రస్తుతం ఈ గెట్ టు గెదర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
1976 బ్యాచ్‌కు చెందిన రాకేశ్ నగర్ అనే వ్యక్తి తన ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. లక్షల మంది వీడియోను లైక్ చేశారు. వేలాది మంది ప్రశంసలతో ముంచెత్తారు. ఇది కదా స్నేహమంటే అని ప్రశంసిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో
సెప్టెంబర్ 20, 2026

Ranbir Kapoor | వినాయకుడి ప్రసాదం వద్దన్న బాలీవుడ్ హీరో – బీఫ్ మ్యాన్ అంటూ ట్రోల్స్
సెప్టెంబర్ 17, 2026

Gurugram Woman Biker Hit By Car | భయానక ఘటన: తనను వెంబడించొద్దన్నందుకు మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి.. వీడియో వైరల్
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో
- ●Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన
- ●DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు
- ●Horoscope | సెప్టెంబర్ 20 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
- ●యూపీఐకి బడ్జెట్ పెట్టలేరా?.. ప్రజల లావాదేవీలే ఆదాయ వనరా?

Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో

Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన

DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు



