త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raihan Vadra | ప్రియాంక గాంధీ కుమారుడి ఫొటో ఎగ్జిబిష‌న్‌పై వివాదం.. స్పందించిన బిక‌నేర్ హౌస్‌

Raihan Vadra | కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కుమారుడు రేహాన్ వాద్రా (Raihan Vadra) ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌పై వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. బిక‌నేర్ హౌజ్ (Bikaner House) యాజ‌మాన్యం 70 శాతం ఫొటోల‌ను బ‌ల‌వంతంగా తొల‌గించింద‌ని రేహాన్ ఆరోపించారు. ఈ వివాదంపై బిక‌నేర్ హౌస్ అధికారులు తాజాగా స్పందించారు.

D

National | Published On Oct 22, 2026, 4.31 pm IST

Raihan Vadra | ప్రియాంక గాంధీ కుమారుడి ఫొటో ఎగ్జిబిష‌న్‌పై వివాదం.. స్పందించిన బిక‌నేర్ హౌస్‌
Advertisement

Raihan Vadra | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా (Raihan Vadra) ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌పై వివాదం రాజుకుంది. ఢిల్లీలోని రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన బికనేర్ హౌస్‌లో (Bikaner House) 'నో ఐడియా ఈజ్ ఫైనల్' (No Idea Is Final) పేరుతో త‌న ఫొటో ఎగ్జిబిష‌న్‌కు కొన్ని గంట‌ల ముందు చాలా వ‌ర‌కూ ఫొటోల‌ను తొల‌గించాల‌ని యాజ‌మాన్యం త‌న‌ను బ‌ల‌వంతం చేసింద‌ని రేహాన్ ఆరోపించారు.

ఈ ప్రదర్శనలో మొత్తం 105 ఫొటోలను ఉంచాల‌ని భావించామ‌ని తెలిపారు. అయితే, వాటిలో దాదాపు 75 ఫొటోల‌ను అంటే 70 శాతం చిత్రాల‌ను బిక‌నేర్ హౌజ్ యాజ‌మాన్యం బలవంతంగా తొలగించిందని ఆరోపించారు. ఈ ఫొటోల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్ప‌ష్టం చేశారు. ఈ ఫోటోలు ఢిల్లీలో యువత చేసిన నిరసనలకు సంబంధించినవని చెప్పారు. ప్రదర్శన లేఅవుట్‌తో సహా పూర్తి వివరాలను ముందుగానే యాజమాన్యానికి సమర్పించానని అన్నారు.

జాతీయ జెండా ఫొటోలు కూడా తొల‌గింపు

తొల‌గించిన వాటిలో జాతీయ జెండా ఉన్న రెండు ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపారు. తాను ఆ రెండింటిని తొలగించడానికి మొదట నిరాకరించానని, అయితే తాను వేదిక బయటకు వెళ్లిన సమయంలో బికనేర్ హౌస్ సిబ్బంది ఆ రెండు ఫోటోల్లో ఒక‌దాన్ని తొల‌గించింద‌ని ఆరోపించారు. భావప్రకటనా స్వేచ్ఛ, కళా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం సరికాదని ఈ సంద‌ర్భంగా రేహాన్ వ్యాఖ్యానించారు.

అధికారులు ఏమ‌న్నారంటే..?

ఈ వ్య‌వ‌హారంపై బిక‌నేర్ హౌస్ అధికారులు స్పందించారు. ఇక్క‌డ జ‌రిగే ఫొటో ప్ర‌ద‌ర్శ‌నలు వ‌న్య‌ప్రాణులు, సంస్కృతి అనే అంశాల‌పై మాత్ర‌మే దృష్టి పెట్టాల‌న్న నిబంధ‌న ఉంద‌ని చెప్పారు. అయితే రేహాన్ ప్ర‌ద‌ర్శించిన ఫొటోగ్రాఫ్‌లు ఈ రెండు కేట‌గిరీల కింద‌కు రాలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాకుండా, రేహాన్ ప్ర‌ద‌ర్శించిన ఫొటోలు రాజ‌కీయ సందేశాల‌ను కలిగి ఉన్నాయని చెప్పారు. అందుకే వాటిని తొల‌గించాల్సిందిగా కోరిన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read..

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మ‌ళ్లింపుపై విచార‌ణ జ‌ర‌పండి: ఇరిగేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శికి ఎంపీ చామ‌ల లేఖ‌

వరుసగా మూడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 460 పాయింట్లు డౌన్..

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - త‌ల లేని డెడ్‌బాడీ మిస్ట‌రీతో...

Advertisement
Advertisement