త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Building Collapse | ఢిల్లీలో కుప్ప‌కూలిన మ‌రో భ‌వ‌నం.. ఇద్ద‌రు మృతి

Building Collapse | ఢిల్లీలో మరో భ‌వ‌నం కుప్పకూలింది (Building Collapse). దేశ రాజ‌ధానిలోని హర్ష్ విహార్ (Harsh Vihar) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్‌లో రెండు స్లాబ్‌లు ఆదివారం సాయంత్రం కూలిపోయాయి.

G

National | Published On Oct 26, 2026, 9.28 am IST

Building Collapse | ఢిల్లీలో కుప్ప‌కూలిన మ‌రో భ‌వ‌నం.. ఇద్ద‌రు మృతి
Advertisement

Building Collapse | త్రినేత్ర న్యూస్‌: ఢిల్లీలో మరో భ‌వ‌నం కుప్పకూలింది (Building Collapse). దేశ రాజ‌ధానిలోని హర్ష్ విహార్ (Harsh Vihar) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్‌లో రెండు స్లాబ్‌లు ఆదివారం సాయంత్రం కూలిపోయాయి. దీంతో ఇద్ద‌రు వ్య‌క్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వారిని బ‌య‌ట‌కు తీసి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే వారు మ‌ర‌ణించారని వైద్యులు వెల్ల‌డించారు.. ఈ నెల 7న స‌త్య సీమాపురి ప్రాంతంలోని స‌త్యానికేత‌న్‌లో (Satya Niketan) ఐదంత‌స్తుల భ‌వ‌నం కూలిపోయిన విష‌యం విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మ‌ర‌ణించిన విష‌యంలో మ‌రువ‌క ముందే మ‌రో బిల్డింగ్ కూలిపోవ‌డం గ‌మ‌నార్హం.

ఆదివారం సాయంత్రం 6.46 గంట‌ల స‌మ‌యంలో బిల్డింగ్ కూలిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని ఢిల్లీ అగ్నిమాప‌క విభాగం తెలిపింది. శిథిలాల కింద 60 ఏండ్లు, 36 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయార‌ని, వారు తండ్రీ కొడుకులుగా భావిస్తున్నామ‌ని అధికారులు చెప్పారు. ఒకే ఫ్లోర్ ఉన్న‌ పుర‌తాన భ‌వ‌నంపై మ‌రో ఫ్లోర్ నిర్మిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అద‌న‌పు డీసీపీ సందీప్ లంబా తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందార‌ని వెల్ల‌డించారు.

 

Advertisement
Advertisement