Murder | భార్యాభర్తల మధ్య ‘నాటు కోడి కూర’ వివాదం.. తండ్రిని చంపిన కుమారుడు
Murder | చేపల కూర చేశాను.. నాటు కోడి కూర ఇప్పుడు వండలేనని భార్య చెప్పడంతో భర్త ఊగిపోయాడు. భార్యను మందలించాడు. పక్కనే ఉన్న కుమారుడు మా అమ్మను ఎందుకు తిడుతున్నావంటూ.. తండ్రిపై రగిలిపోయాడు. క్షణికావేశంలో తండ్రిపై రోకలి బండతో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Murder | త్రినేత్ర.న్యూస్ : చేపల కూర చేశాను.. నాటు కోడి కూర ఇప్పుడు వండలేనని భార్య చెప్పడంతో భర్త ఊగిపోయాడు. భార్యను మందలించాడు. పక్కనే ఉన్న కుమారుడు మా అమ్మను ఎందుకు తిడుతున్నావంటూ.. తండ్రిపై రగిలిపోయాడు. క్షణికావేశంలో తండ్రిపై రోకలి బండతో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జంగిటి రమేశ్(42) మంగళవారం రాత్రి 10 గంటలకు ఒక నాటు కోడి తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇక నాటు కోడి వండాలని భార్యను ఆదేశించాడు. చేపల కూర చేశాను.. ఇప్పుడు నాటు కోడి కూర వండలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యను మందలించాడు. వీరి వాగ్వాదాన్ని గమనిస్తున్న కుమారుడు గణేశ్ జోక్యం చేసుకున్నాడు. అమ్మను ఎందుకు తిడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ కుమారుడిపై రమేశ్ చేయి చేసుకున్నాడు.
క్షణికావేశంలో గణేశ్ పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. రమేష్ అక్కడే పడిపోవడంతో సుంకరి హరీష్ అనే వ్యక్తి గమనించి చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని అక్కడికి వైద్యులు సూచించారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే బుధవారం ఉదయం 11 గంటలకు రమేశ్ మృతి చెందారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
జూన్ 11, 2026

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
జూన్ 11, 2026

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి

Ramchandar Rao | ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నరు.. మనం కూడా సిద్ధం కావాలే

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి



