Naga Durga | ఓటీటీలో నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రెండింగ్ – హయ్యెస్ట్ వ్యూస్‌తో రికార్డ్
తెలుగు ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ లవ్ ఓ లవ్ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో హాలీవుడ్ సినిమాలను దాటేసి లవ్ ఓ లవ్ నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. లవ్ ఓ లవ్‌లో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించాడు.
Entertainment | Published On Aug 4, 2026, 2.59 pm IST
Naga Durga | తెలుగు ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ లవ్ ఓ లవ్ ఓటీటీలోఅదరగొడుతోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రెండింగ్ సినిమాల లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. సాయిపల్లవి ఏక్‌దిన్‌తో పాటు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ప్రాజెక్ట్ హేల్ మేరీ, ఘోస్ట్ ట్రైన్ లాంటి సినిమాలను దాటేసి టాప్‌లో నిలిచింది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు వెర్షన్‌కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఐదు రోజుల్లోనే రెండు మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ మినట్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ధనుష్ మేనల్లుడు...
లవ్ ఓ లవ్ సినిమాలో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించాడు. ఈ సినిమాతోనే నాగదుర్గ హీరోయిన్‌గా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు.
డిజాస్టర్...
థియేటర్లలో లవ్ ఓ లవ్ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కోటి లోపే వసూళ్లను రాబట్టి డిసపాయింట్ చేసింది. ఓటీటీలో మాత్రం చక్కటి రెస్సాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయనే పాయింట్‌తో దర్శకుడు మగీష్ రాజేంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
రఘు అవంతిక లవ్‌స్టోరీ...
రఘు ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అప్పు చేయాలనే సిద్ధాంతానికి వ్యతిరేకం. కష్టపడి ఒక్కో రూపాయి పోగుచేస్తుంటాడు. అలాంటి టైమ్‌లోనే అవంతితో ప్రేమలో పడతాడు రఘు. సినిమాలు, షాపింగ్‌లు, టూర్లు అంటూ రఘు డబ్బులతో అవంతిక జల్సాలు చేస్తుంది. సరిగ్గా ఉద్యోగం కూడా చేయనివ్వదు. రఘు అప్పుల పాలవుతాడు. ఉద్యోగం పోతుంది. అవంతిక కారణంగా కుటుంబానికి దూరమైన రఘు దుబాయ్ పారిపోవాలని అనుకుంటాడు. కానీ మహిళా మండలి నాయకురాలు పెట్టిన కేసు కారణంగా జైలు పాలవుతాడు. ఆ తర్వాత ఏమైంది? రఘు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాడా? రఘు ప్రేమను అవంతిక అర్థం చేసుకుందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chinmayi | జయలలితనూ అవమానించారు – త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, ఖుష్బూ డిమాండ్
ఆగస్టు 4, 2026

Keerthy Suresh | ప్యారడైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్రకు దూరం – మహానటిపై నెటిజన్ల ప్రశంసలు
ఆగస్టు 3, 2026

Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ ప్రేమలో పడిందా? – బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు వైరల్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
- ●Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’
- ●CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?
- ●ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?

స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’



