త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. గాల్లో ఎగిరి ప‌డ్డ మ‌హిళ‌

Road Accident | క‌ర్ణాట‌క‌ (Karnataka)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ మ‌హిళ‌ను అతివేగంగా వ‌చ్చిన కారు బ‌లంగా ఢీ కొట్టింది (car hit a woman).

D

National | Published On Apr 2, 2026, 11.22 am IST

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. గాల్లో ఎగిరి ప‌డ్డ మ‌హిళ‌
Advertisement

Road Accident | క‌ర్ణాట‌క‌ (Karnataka)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ మ‌హిళ‌ను అతివేగంగా వ‌చ్చిన కారు బ‌లంగా ఢీ కొట్టింది (car hit a woman). దీంతో స‌ద‌రు మ‌హిళ అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ప‌డింది. అక్క‌డిక‌క్క‌డే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మంగ‌ళూరు (Mangaluru)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార‌తి (48) అనే మ‌హిళ ఓ యువ‌తితో క‌లిసి రోడ్డు దాటేందుకు ప్ర‌య‌త్నించింది. అదే స‌మ‌యంలో వేగంగా వ‌చ్చిన కారు ఆమెను బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో భార‌తి గాల్లో ఎగిరి రోడ్డుపై ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఆమె స్వ‌స్థ‌లం ఉల్లాల్ తాలూకాలోని బొలియారు గ్రామంగా గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా పనిచేస్తున్నాం: సీఎం రేవంత్‌

అది నా పూర్వ‌జ‌న్మ సుకృతం.. ప్ర‌త్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి

ఇండోనేషియాను కుదిపేసిన అత్యంత శ‌క్తిమంత‌మైన భూకంపం.. ఒక‌రు మృతి

Advertisement
Advertisement