Hero Bharath Kanth | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో భరత్ కాంత్ మృతి
Hero Bharath Kanth | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగర శివార్లలోని బొంగలూరు గేటు వద్ద అతి వేగంగా వచ్చిన ఓ కారు కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Entertainment | Published On May 11, 2026, 6.36 am IST
Hero Bharath Kanth | త్రినేత్ర.న్యూస్ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగర శివార్లలోని బొంగలూరు గేటు వద్ద అతి వేగంగా వచ్చిన ఓ కారు కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన రెండు మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతులను హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రఫర్ త్రిలోక్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల విడుదలైన టాలెంట్ సినిమాలో భరత్ కాంత్ హీరోగా నటించారు. పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో నటించారు. పలు తెలుగు సినిమాలకు త్రిలోక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇద్దరూ కలిసి నెల్లూరు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




