త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | నేడు మ‌రోసారి సీబీఐ ముందుకు ద‌ళ‌ప‌తి విజ‌య్‌

Thalapathy Vijay | త‌మిళ అగ్ర‌హీరో, టీవీకే అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay)మ‌రోసారి సీబీఐ ముందు (CBI Probe) హాజ‌రుకానున్నారు. గ‌తేడాది సెప్టెంబర్‌ 27న కరూర్‌లో పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట (Karur Stampede) జరిగిన విష‌యం తెలిసిందే.

G

National | Published On Jan 19, 2026, 10.25 am IST

Thalapathy Vijay | నేడు మ‌రోసారి సీబీఐ ముందుకు ద‌ళ‌ప‌తి విజ‌య్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ అగ్ర‌హీరో, టీవీకే అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay)మ‌రోసారి సీబీఐ ముందు (CBI Probe) హాజ‌రుకానున్నారు. గ‌తేడాది సెప్టెంబర్‌ 27న కరూర్‌లో పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట (Karur Stampede) జరిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 41 మంది మరణించారు. విజ‌య్ ఆల‌స్యంగా రావ‌డం, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్ విఫ‌ల‌మ‌వ‌డంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షతో సీబీఐ దర్యాప్తునకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.

దీంతో ఈ నెల 12న విజ‌య్‌తోపాటు టీవీకే నేత‌ల‌ను సీబీఐ ప్ర‌శ్నించి. ఢిల్లీలోని ప్ర‌ధాన కార్యాల‌యంలో విజ‌య్‌ని ఆరుగంట‌ల పాటు ప్ర‌శ్నించింది. ఈ సంద‌ర్భంగా మొత్తం 90 ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్లు స‌మాచారం. అందులో సభ ఏర్పాట్లతో మొదలు.. పలు విషయాలు ఉన్నాయి. అయితే పోలీసుల వైఫల్యంతోనే తొక్కిసలాట జ‌రిగింద‌న‌ట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తున్న‌ది. ఆ సమయంలోనే మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని.. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ తేల్చి చెప్పింది. అయితే సంక్రాంతి తర్వాత వస్తానని ఆయన చెప్ప‌డంతో సోమ‌వారం రావాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ఆదివారం సాయంత్ర‌మే ఢిల్లీకి చేరుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement