Road Accident | ట్రక్కును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఏడుగురు సజీవ దహనం
Road Accident | రాజస్థాన్‌లోని (Rajasthan) దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై (Delhi-Mumbai expressway) ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న ఓ ట్రక్కును ఢీకొట్టింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్: రాజస్థాన్‌లోని (Rajasthan) దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై (Delhi-Mumbai expressway) ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు.
ప్రైవేటు లగ్జరీ స్లీపర్ బస్సు హరిద్వార్ (Haridwar) నుంచి ఇండోర్‌కు (Indore) వెళ్తున్నది. ఈ క్రమంలో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య దౌసా జిల్లా కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రెస్ట్ ఏరియా సమీపంలో ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు.. రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి పడిపోయింది. బస్సు వెనుక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే మొత్తానికి వ్యాపించాయి. పలువురు ప్రయాణికులు బస్సు కిటీకీల అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. అయితే ఏడుగురు మాత్రం అందులోనే చిక్కుకుపోవడంతో సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు దౌసా జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Dausa, Rajasthan: A road accident took place in Dausa after a tourist bus carrying around 37 pilgrims from Haridwar to Indore collided with a truck on the Delhi–Mumbai Expressway in the early hours today. Following the collision, both vehicles caught fire. The passengers managed… pic.twitter.com/wp5zGGi96W
— IANS (@ians_india) July 1, 2026
#Rajasthan: Fire broke out in a bus in #Dausa. So far, 7 passengers have died, more than 20 are injured. The bus was traveling from #Rishikesh to #Indore. A total of 39 passengers were on board. It suddenly collided with a truck ahead and caught fire. pic.twitter.com/XlEihZdu8m
— Siraj Noorani (@sirajnoorani) July 1, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..
- ●Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. హరీశ్ రావు, కూనంనేని సంతాపం
- ●Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. హరీశ్ రావు, కూనంనేని సంతాపం

Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి






