Mexico Vs Ecuador | అజ్టెకాలో మెక్సికో విజయ గర్జన
Mexico Vs Ecuador | ఫిఫా వరల్డ్ కప్‌లో సొంత మైదానంలో మెక్సికో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నది. ప్రఖ్యాత అజ్టెకా స్టేడియంలో ఈక్వెడార్‌పై 2-0 తేడాతో గెలుపొందింది. 1986 తర్వాత తొలిసారిగా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో గెలువడం విశేషం. ఈ విజయంతో మెక్సికో ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. దాంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ గంట సేపు ఆల్యమైంది.
- ఈక్వెడాన్‌పై 2-0 తేడాతో గెలుపు
- 40 ఏళ్ల తర్వాత నాకౌట్‌కు
- 1986 తర్వాత తొలిసారిగా నాకౌట్ విజయం
- సంబరాల్లో అభిమానులు
Mexico Vs Ecuador | ఫిఫా వరల్డ్ కప్‌లో సొంత మైదానంలో మెక్సికో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నది. ప్రఖ్యాత అజ్టెకా స్టేడియంలో ఈక్వెడార్‌పై 2-0 తేడాతో గెలుపొందింది. 1986 తర్వాత తొలిసారిగా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో గెలువడం విశేషం. ఈ విజయంతో మెక్సికో ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. దాంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ గంట సేపు ఆల్యమైంది.
32వ నిమిషంలో తొలి గోల్..
స్టేడియంలో గ్రీన్ జెర్సీలతో నిండిన అభిమానుల మధ్య జావియర్ అగ్విరే నేతృత్వంలోని మెక్సికో జట్టు తొలిభాగంలోనే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈక్వడార్‌ను ఒత్తిడికి గురిచేసిన మెక్సికో.. ఎటాకింగ్‌తో మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంది. 22వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ ఎడమ వైపు నుంచి బంతిని అందుకుని పెనాల్టీ బాక్స్‌లోకి ప్రవేశించి సమీప పోస్ట్‌కు తక్కువ ఎత్తులో కొట్టి గోల్ వేసి ఆధిక్యంలో నిలబెట్టాడు. తొలి గోల్ తర్వాత కూడా మెక్సికో దూకుడు తగ్గలేదు. 32వ నిమిషంలో రౌల్ జిమెనెజ్, క్వినోనెస్‌తో కలసి చేసిన చక్కటి వన్-టూ పాస్‌ల తర్వాత బంతిని అద్భుతంగా టాప్ కార్నర్‌లోకి పంపించి స్కోరును 2-0కు చేర్చాడు. హాఫ్ టైమ్‌కి ముందే మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. సెకండ్ ఆఫ్‌లో ఈక్వెడార్ బంతిపై ఎక్కువగా ఆధిపత్యం చూపించినా.. మెక్సికో డిఫెన్స్ కట్టుదిట్టంగా వ్యవహరించింది. అగ్విరే జట్టు డిఫెన్స్ ప్రతి దాడిని సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రత్యర్థికి స్పష్టమైన అవకాశాలు లేకుండా మ్యాచ్‌ను నియంత్రించింది.
ఇంజ్యూరీ టైమ్‌లో..
ఇంజ్యూరీ టైమ్‌లో ఈక్వెడార్‌కు మరో దెబ్బ తగిలింది. మ్యాచ్ చివరలో జరిగిన వాగ్వాదంలో ఆటగాడు పియెరో హింకాపీ తన నోటిని చేతితో మూసుకున్నందుకు రెడ్ కార్డు పడింది. ఫిపా కొత్త నిబంధనల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ విజయం మెక్సికోకు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. 1986లో ఇదే అజ్టెకా స్టేడియంలో బల్గేరియాపై గెలిచిన తర్వాత వరల్డ్‌కప్ నాకౌట్ విజయాన్ని మెక్సికో మళ్లీ ఇప్పుడు మాత్రమే అందుకుంది. మధ్యలో వరుసగా ఏడు టోర్నీల్లో తొలి నాకౌట్ దశలోనే నిష్క్రమించిన జట్టు తాజాగా రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. అదే సమయంలో అజ్టెకా స్టేడియంలో మెక్సికో రికార్డు కూడా అజేయంగా కొనసాగుతోంది. 2013 తర్వాత ఈ వేదికపై మెక్సికో ఏ పోటీ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అంతేకాకుండా మెక్సికో సిటీ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో కూడా ఇప్పటివరకు ఓటమి అనేదే లేకుండా కొనసాగుతోంది. అలాగే, గోల్ ఇవ్వకుండా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన నాలుగు జట్లలో ఒకటిగా మెక్సికో నిలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అజ్టెకా స్టేడియంలో సంబురాలు మిన్నంటాయి. 40 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన ఈ విజయం.. మెక్సికో అభిమానులకు మరోసారి కలను సాకారం చేసింది. ప్రీక్వార్టర్స్‌లో ఇంగ్లండ్ లేదంటే డీఆర్ కాంగోను ఢీకొట్టే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు
ఆగస్టు 23, 2026

Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
ఆగస్టు 23, 2026

CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్



