Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
Building collapsed in Gachibowli | హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో పెను విషాదం చోటుచేసుకుంది. అంజయ్యనగర్‌లోని నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
- మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కార్మికుల మృతి
- భయంతో పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థుల పరుగు
Building collapsed in Gachibowli | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో పెను విషాదం చోటుచేసుకుంది. అంజయ్యనగర్‌లోని నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేశ్ కారే (34), మోపత్ (42) ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. ఈ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. అంజయ్యనగర్‌లో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఏడంతస్తుల భవనం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కూలిపోయింది. పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై ఆ భవనం శిథిలాలు పడడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. అపార్ట్‌మెంట్ గోడలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో అందులో నివసిస్తున్నవారు బయటకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న ఓ హాస్టల్ విద్యార్థులు సైతం భయంతో బయటకు పరుగులు పెట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటారేమోనని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదే ప్రమాదం సాయంత్రం సమయంలో జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎంసీ కమిషనర్ సృజన ఘటనా స్థలాన్ని పరిశీలించి సూచనలు చేశారు.
బిల్డర్ కోసం పోలీసుల వేట..
మరోవైపు సరైన ప్రమాణాలు లేకుండా తక్కువ సమయంలో భవనం నిర్మించడంతో పేకమేడలా కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనం నిర్మాణం చేస్తున్న బిల్డర్ సాజిద్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే జీహెచ్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణం జరిగిందా? లేదా? సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మాదాపూర్‌లో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం
శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని వెలికితీస్తున్న డీఆర్ఎఫ్ సిబ్బంది
శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు
అంజయ్య నగర్లో కేవలం 50 గజాల స్థలంలో అక్రమంగా ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించిన యజమానులు https://t.co/1rIMFydxR8 pic.twitter.com/oF8MAN2eIQ
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
మాదాపూర్‌లో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం
నాలా పక్కనే 50 గజాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడం
అంజయ్య నగర్లో కేవలం 50 గజాల స్థలంలో అక్రమంగా ఏడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టిన యజమానులు
ఒక్కసారిగా భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడడంతో, ఆ భవనం కూడా దెబ్బతిన్న వైనం… pic.twitter.com/IDxXxSHTqZ
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
సంబంధిత వార్తలు

Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ
ఆగస్టు 22, 2026

Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి
ఆగస్టు 22, 2026

Bhatti Vikramarka | పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛ ఉండాలి.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ ఉండాలి
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్
- ●Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
- ●Deepika Padukone | మళ్లీ తెరపైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపికా!
- ●Telecom Rules 2026 | కొత్త సిమ్ కార్డుకు బయోమెట్రిక్ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..
- ●Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ
- ●Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి

SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్

Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు

Deepika Padukone | మళ్లీ తెరపైకి స్పిరిట్ వివాదం.. ఒక్క లైక్‌తో సందీప్‌రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చిన దీపికా!

Telecom Rules 2026 | కొత్త సిమ్ కార్డుకు బయోమెట్రిక్ తప్పనిసరి.. కొత్త నిబంధనలు ఇవే..



