త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు

Mid-Day Meal | పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు, పౌష్టికారం అందించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం (Mid-Day Meal) నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా మారుతున్న‌ది. నాణ్య‌త లోపించ‌డం, ఆహారం క‌లుషిత‌మ‌వ‌డం, ఆహారం పురుగులు (Worms) రావ‌డం వంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చోటుచేసుకుంటున్నాయి.

G

National | Published On Aug 22, 2026, 7.30 am IST

Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు
Advertisement

Mid-Day Meal | త్రినేత్ర‌.న్యూస్‌: పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు, పౌష్టికారం అందించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన‌ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం (Mid-Day Meal) నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా మారుతున్న‌ది. నాణ్య‌త లోపించ‌డం, ఆహారం క‌లుషిత‌మ‌వ‌డం, ఆహారం పురుగులు (Worms) రావ‌డం వంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చోటుచేసుకుంటున్నాయి. పౌష్టికాహారం అందించ‌డం అటుంచితే.. పాఠ‌శాల‌ల్లో (Government schools) వ‌డ్డించే అన్నం, ప‌దార్థాలు తిని అనారోగ్యాన్ని కొనితెచ్చుకునేలా ఈ ప‌థ‌కం త‌యారైంది. దీంతో మ‌ధ్యాహ్న భోజ‌నం తినాలంటేనే విద్యార్థులు జంకుతున్నారు. దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. తాజాగా బీహార్‌లోని (Bihar) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో వ‌డ్డించిన మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు క‌ల‌క‌లం సృష్టించాయి. అర్వాల్ జిల్లాలోని ఏకంగా 75 స్కూళ్ల‌లో వ‌డ్డించిన ఆహారంలో పురుగులు ఉన్నాయి. ఇది కాస్తా ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో అందిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌న నాణ్య‌త‌పై అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తున్న‌ది.

అర్వాల్ జిల్లాలోని 75 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అన్న‌, సోయాబీన్‌-ఆలుగ‌డ్డ కూర‌ల‌తో మ‌ధ్యాహ్న భోజ‌నం అందించారు. అయితే అందులో పురుగుల‌ను గుర్తించిన విద్యార్థులు భోజ‌నం తిన‌డానికి నిరాక‌రించారు. సిబ్బంది నిర్ల‌క్ష్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన వారు.. ఆహారాన్ని తిన‌కుండా ప‌డేశారు. జిల్లాలో మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని `రాయ‌ల్ మాన‌వ్ మిత్ర సేవా స‌మితి` స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ప్ర‌స్తుత ఈ వీడియో సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతున్న‌ది.

ఈ ఘ‌ట‌న‌పై విచారణకు ఆదేశించామ‌ని అర్వాల్ (Arwal) జిల్లా విద్యాధికారి తెలిపారు. దర్యాప్తులో సంస్థ నిర్లక్ష్యం, తప్పు ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల ఆరోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement