Srinivas Goud | పాలమూరు జిల్లాల ఒక్క కొత్త పనైనా అయిందా?
V Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లాకు ఒక్క కొత్త పనైనా (New work) అయిందా అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) ప్రశ్నించారు.
- చేయాల్సిన పనులు చేయకుండా కేసీఆర్‌ను నిందిస్తే ప్రజలు ఒప్పుకోరు
- కృష్ణా నుంచి కనీసం 30 టీఎంసీలు కూడా ఎత్తిపోయలే
- ఎగ్గొట్టడంలో కాంగ్రెస్సే నెంబర్ వన్
- మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
Srinivas Goud | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లాకు ఒక్క కొత్త పనైనా (New work) అయిందా అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) ప్రశ్నించారు. చేయాల్సిన పనులు చేయకుండా కేసీఆర్‌ను నిందిస్తే ప్రజలు అంగీకరించరన్నారు. ఏపీకి నీళ్లు పోతున్నా కృష్ణా నుంచి కనీసం 30 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయలేదని విమర్శించారు. ఎగ్గొట్టడంలో కాంగ్రెస్ నంబర్ వన్ అని దుయ్యబట్టారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో పాలమూరు జిల్లా ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తే.. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలసలు మొదలయ్యాయని ఆరోపించారు.
60 టీఎంసీలు నింపే వీలుండే
గతంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు నిధులన్నీ తీసుకుపోతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాలమూరు జిల్లాకు ఏడాదికి 20 వేల కోట్లు ఇస్తామన్నారు. మూడేళ్లు అయింది.. 60 వేల కోట్లు కాదు ఆరు కోట్లు అయినా వచ్చాయా? పాలమూరును దగా చేసింది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చెందిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కు వచ్చాయి. ఏపీ నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోకుండా పాలమూరుపై కక్ష గట్టింది కాంగ్రెస్సే. 300 మీటర్ల మేర మరమ్మతులు చేస్తే.. 60 టీఎంసీలు నింపే అవకాశం ఉన్నా చేయలేదు.
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తే మాత్రమే సరిపోతుందా? ఉద్యోగులు పీఆర్సీ, డీఏలు ఇస్తామన్నందుకు ఓట్లు వేశారు. కేసీఆర్ అప్పులు చేశారని పదేపదే అంటున్నారు. ఆ డబ్బుతో ప్రాజెక్టులు కట్టారు, రోడ్లు వేశారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాల కోరు. పాలమూరు జిల్లా కలకలలాడాలన్నా, రైతు రాజు కావాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందే అని శ్రీనివాస్‌గౌడ్ నొక్కి చెప్పారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే
నవంబర్ 10, 2026

Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!
నవంబర్ 10, 2026

Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్‌పై అక్రమ కేసు పెట్టారు.. ఆయన మరణం దురదృష్టకరం
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Tatas iPhone factory | టాటా ఐఫోన్ ఫ్యాక్టరీలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం
- ●Rukmini Vasanth | లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్
- ●American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..
- ●Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
- ●Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే
- ●Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు

Tatas iPhone factory | టాటా ఐఫోన్ ఫ్యాక్టరీలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం

Rukmini Vasanth | లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్

American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..

Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్



