American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..
American Express | అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా తన క్రెడిట్ కార్డులను గతంలో రద్దు చేసుకున్న కస్టమర్ల ఖాతాల నుంచి లక్షలాది మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్లను తొలగించింది. సాంకేతిక లోపం కారణంగా గడువు ముగిసిన పాయింట్లు ఖాతాల్లో కనిపిస్తున్నాయని సంస్థ వివరణ ఇచ్చింది. అయితే ఒకే ఖాతాలో పలు కార్డుల రివార్డ్ పాయింట్లు జమయ్యే విధానం కారణంగా కస్టమర్లు ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
American Express | అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇండియా తన క్రెడిట్ కార్డులను గతంలో రద్దు చేసుకున్న కస్టమర్ల ఖాతాల నుంచి లక్షలాది మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్లను తొలగించింది. సాంకేతిక లోపం కారణంగా గడువు ముగిసిన పాయింట్లు ఖాతాల్లో కనిపిస్తున్నాయని సంస్థ వివరణ ఇచ్చింది. అయితే ఒకే ఖాతాలో పలు కార్డుల రివార్డ్ పాయింట్లు జమయ్యే విధానం కారణంగా కస్టమర్లు ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర చర్చకు దారి తీసిన అమెక్స్ ఇండియా చర్య..
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (అమెక్స్) ఇండియా తీసుకున్న నిర్ణయం క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో రద్దు చేసుకున్న కార్డులకు సంబంధించిన మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్లను సంస్థ తొలగించింది. ప్రభావిత కస్టమర్లకు పంపిన ఈ-మెయిల్‌లో సాంకేతిక సమస్య కారణంగా అర్హత లేని పాయింట్లు కూడా నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఖాతాల్లో కనిపిస్తున్నాయని సంస్థ తెలిపింది. కార్డు రద్దు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా సంబంధిత పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని, లేదంటే అవి రద్దవుతాయని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని వివరించింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి, నిబంధనల ప్రకారం ఖాతాల్లోని పాయింట్ల నిల్వలను సవరించినట్లు వెల్లడించింది.
రాత్రికి రాత్రే లక్షల రివార్డు పాయింట్లు మాయం..
ఈ పరిణామంతో పలువురు కస్టమర్లు తమ ఖాతాల్లో భారీగా పాయింట్లు తగ్గిపోయాయని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. నవంబర్ 9న కొందరి ఖాతాల్లో సుమారుగా 4 లక్షలపాయింట్లు తొలగించినట్లు స్క్రీన్‌షాట్లు వెల్లడిస్తున్నాయి. సుమంత మండల్ అనే కస్టమర్ తన ఖాతా నుంచి 23,88,090 పాయింట్లు తొలగించారని, దీంతో ఖాతా నిల్వ మైనస్ 21,48,040 పాయింట్లకు చేరిందని ఎక్స్ వేదికగా పేర్కొంది. మరో కస్టమర్ రోషన్ అగర్వాల్ తన ఖాతా నుంచి తొలగించిన పాయింట్ల విలువ సుమారు రూ.4.5 లక్షలు ఉంటుందని తెలిపాడు.
స్పందించిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్..
అయితే ఈ వ్యవహారంలో ప్రధాన సమస్య ఒకే కస్టమర్‌కు చెందిన పలు కార్డుల పాయింట్లను ఒకే ఖాతాలో కలిపి చూపించే విధానం. అమెక్స్ మెంబర్‌షిప్ రివార్డ్స్ నిబంధనల ప్రకారం, ఒకే కస్టమర్‌కు చెందిన అనుసంధానిత ప్రాథమిక కార్డుల ఖాతాల్లో ఖర్చుల ఆధారంగా పాయింట్లు కలిపి జమవుతాయి. దీంతో ఏ కార్డుకు ఎన్ని పాయింట్లు వచ్చాయో, కార్డు రద్దు చేసినప్పుడు వాటిని ప్రత్యేకంగా గుర్తించి రిడీమ్ చేసుకోవడం సాధ్యం కాలేదని వినియోగదారులు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఒక కార్డును రద్దు చేసిన తర్వాత కూడా ఉమ్మడి ఖాతాలోని పాయింట్లను ఉపయోగించిన సందర్భాల్లో, ఏ కార్డుకు సంబంధించిన పాయింట్లను ఎలా లెక్కించారో వివరించాలని కోరుతున్నారు. ప్రతి కార్డుకు సంబంధించి సంపాదించిన, వినియోగించిన, తిరిగి తొలగించిన పాయింట్ల వివరాలతో కూడిన లెక్కలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమెక్స్ పంపిన ఈ-మెయిల్‌లో ఈ లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. నవంబర్ 15 నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక కార్డులు కలిగిన కస్టమర్ల పాయింట్లను ఉమ్మడి ఖాతాలో కాకుండా ప్రతి కార్డుకు విడివిడిగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న పాయింట్లను కూడా ఆయా కార్డుల వ్యక్తిగత నిల్వల ఆధారంగా విభజించనున్నట్లు తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
- ●Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే
- ●Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు
- ●Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?
- ●Woman Home Guard Murdered | మహిళా హోంగార్డు మహబూబీ దారుణ హత్య.. చంపింది ఎవరంటే!
- ●Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండగా రోడ్డు ప్రమాదం.. దుబాయ్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం

Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్

Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే

Diwali celebration | దీపావళి వేడుకలతో చెత్తమయమైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమర్శలు

Gold Prices | జేపీ మోర్గాన్ సంచలనం.. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర @ రూ.5 లక్షలు..?






