త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renu Desai | మ‌గాడు ఎన్ని పెళ్లిళ్ల‌యినా చేసుకోవ‌చ్చు – రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైర‌ల్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా లెజినోవా విడాకుల తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విడాకుల వార్త‌ల వేళ‌...మాజీ భ‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి గ‌తంలో రేణుదేశాయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Nov 10, 2026, 2.22 pm IST

Renu Desai | మ‌గాడు ఎన్ని పెళ్లిళ్ల‌యినా చేసుకోవ‌చ్చు – రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైర‌ల్‌
Advertisement

Renu Desai |  ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వ్య‌వ‌హారం సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే తాము విడిపోతున్న‌ట్లు వీరిద్ద‌రు సోమ‌వారం అర్ధ‌రాత్రి ప్ర‌క‌టించారు. భార్యాభ‌ర్త‌లుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కొన‌సాగుతామ‌ని, పిల్ల‌ల‌కు బాధ్య‌త‌యుత‌మైన త‌ల్లిదండ్రులుగా ఉంటామ‌ని వెల్ల‌డించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా విడాకులపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్

కొద్ది నెల‌ల క్రితం అన్నా లెజినోవా...అన్నా కొణిదెల పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. భ‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు త‌మ కుటుంబ వేడుక‌ల తాలూకు ప‌లు ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ వ‌చ్చింది. స‌డెన్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమానుల్లో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌లే అన్నా లెజినోవా ర‌ష్యాకు వెళ్లిపోయింది. అక్క‌డి నుంచే విడాకుల ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది. ఇక ఆమె ఇండియా రావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు.

ఎన్ని పెళ్లిళ్లు అయినా...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా విడాకుల వేళ రేణు దేశాయ్ గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతోన్నాయి. "ఓ మ‌గాడు స‌మాజంలో ఏమైనా చేయ‌చ్చు...ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవ‌చ్చు. ఒక మ‌హిళ మ‌రో పెళ్లి గురించి ఆలోచించ‌డం మాత్ర‌మ నేరంగా చూస్తుంటారు" అని రేణుదేశాయ్ 2018లో ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్న‌ది.

ఆవేద‌న‌...

అంతే కాకుండా త‌న‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌గానే చూస్తూ ఇప్ప‌టికీ ట్రోల్ చేస్తున్నార‌ని రేణుదేశాయ్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. "శ్రీరాముడికి 14 ఏళ్లే వ‌న‌వాసం. నేను, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని 14 ఏళ్లు దాటిపోయింది. మ‌రి నా వ‌న‌వాసం ఎప్పుడూ ముగుస్తుందో" అంటూ ఇటీవ‌ల అన్న‌ది. ఈ కామెంట్ల తాలూకు వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement
Advertisement