Nvidia | ఎన్విడియా సీఈఓకు కొత్త చిక్కులు.. సమాచారం దాచారంటూ కోర్టును ఆశ్రయించిన వాటాదారులు..
Nvidia | ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా, దాని సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. చైనా నిఘా వ్యవస్థతో సంబంధాలున్నాయనే అనుమానాలు ఎదుర్కొంటున్న మహిళతో జెన్సన్ హువాంగ్‌కు ఉన్నట్లు చెబుతున్న సంబంధం గురించి పెట్టుబడిదారులకు సమాచారం దాచిపెట్టారంటూ వాటాదారులు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ఎన్విడియా షేర్లు 4.3 శాతం పడిపోయి, కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 190 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి.
Nvidia | ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా, దాని సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. చైనా నిఘా వ్యవస్థతో సంబంధాలున్నాయనే అనుమానాలు ఎదుర్కొంటున్న మహిళతో జెన్సన్ హువాంగ్‌కు ఉన్నట్లు చెబుతున్న సంబంధం గురించి పెట్టుబడిదారులకు సమాచారం దాచిపెట్టారంటూ వాటాదారులు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ఎన్విడియా షేర్లు 4.3 శాతం పడిపోయి, కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 190 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి.
కోర్టును ఆశ్రయించిన వాటాదారులు..
ఎన్విడియా, దాని సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై అమెరికాలో వాటాదారుల తరఫున ప్రతిపాదిత క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని దాచిపెట్టి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని పిటిషన్‌లో ఆరోపించారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ ఫెడరల్ కోర్టులో సోమవారం ఈ ఫిర్యాదు దాఖలైంది. జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో సంబంధం ఉందని, ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో గతంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారని పిటిషన్ పేర్కొంది. అయితే వీరిద్దరూ బంధువులు కాదని స్పష్టం చేసింది. గత నెలలో ఆలిస్ హువాంగ్ చైనా నిఘా సంస్థకు సంబంధించిన వ్యక్తిగా అమెరికా అధికారులు నిర్ధారించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఆరోపణలు కంపెనీ ప్రతిష్ఠ, వ్యాపార అవకాశాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులకు సమాచారం వెల్లడించలేదని వాటాదారులు ఆరోపిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ ముగిశాక దావా..
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో తన భార్యకు తాను నమ్మకద్రోహం చేశానని కంపెనీ ఉద్యోగులతో జెన్సన్ హువాంగ్ చెప్పినట్లు సమాచారం. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎన్విడియాను సహ-స్థాపించిన జెన్సన్ హువాంగ్, కృత్రిమ మేధ రంగంలో కంపెనీని ప్రపంచంలోనే అత్యంత విలువైన చిప్ తయారీ సంస్థగా తీర్చిదిద్దారు. దీంతో ఆయన అంతర్జాతీయ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. మరోవైపు ఈ వివాదం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. సోమవారం ఎన్విడియా షేర్లు 4.3 శాతం క్షీణించడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి సుమారు 190 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్ ముగిసిన ఐదు నిమిషాల తర్వాత ఈ దావా దాఖలైనట్లు రాయిటర్స్ వెల్లడించింది. సాధారణంగా కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పడిపోయిన సందర్భాల్లో వాటాదారులు ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు చేస్తుంటారు. మార్క్ కిస్టెన్‌మేకర్ నేతృత్వంలోని పెట్టుబడిదారులు ఎన్విడియా, జెన్సన్ హువాంగ్ నుంచి ఎంత పరిహారం కోరుతున్నారో నిర్దిష్టంగా వెల్లడించలేదు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Srinivas Goud | పాలమూరు జిల్లాల ఒక్క కొత్త పనైనా అయిందా?
- ●Tatas iPhone factory | టాటా ఐఫోన్ ఫ్యాక్టరీలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం
- ●Rukmini Vasanth | లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్
- ●American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..
- ●Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు - రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
- ●Singireddy Niranjan Reddy | పాలమూరును వెయ్యేళ్లకు సరిపడా విధ్వంసం చేసింది కాంగ్రెస్సే

Srinivas Goud | పాలమూరు జిల్లాల ఒక్క కొత్త పనైనా అయిందా?

Tatas iPhone factory | టాటా ఐఫోన్ ఫ్యాక్టరీలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం

Rukmini Vasanth | లాఠీ పట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో రుక్మిణి వసంత్

American Express | రాత్రికి రాత్రే లక్షల రివార్డ్ పాయింట్లు మాయం.. అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌పై కస్టమర్ల ఆగ్రహం..






