త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Police Jobs | తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..!

TG Police Jobs | తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌. 7,437 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి దరఖాస్తు గడువును పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు బుధవారం (సెప్టెంబర్‌ 9)తో గడువు ముగియాల్సి ఉంది.

P

Telangana | Published On Sep 8, 2026, 3.18 pm IST

TG Police Jobs | తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..!
Advertisement

TG Police Jobs | తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌. 7,437 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి దరఖాస్తు గడువును పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు బుధవారం (సెప్టెంబర్‌ 9)తో గడువు ముగియాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ గడువును సెప్టెంబర్‌ 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువు ముగింపు సమయం దగ్గరపడటంతో ఇంకా అప్లికేషన్‌ చేసుకోని అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.

అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఇప్పటివరకు దరఖాస్తు సమర్పించని వారు ఈ అదనపు గడువులోగా అప్లికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలు క‌లుగ‌నుంది. పోలీస్‌ శాఖలో భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియపై నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఆసక్తి నెలకొంది. ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం ఖాళీల్లో 7,112 కానిస్టేబుల్‌, 275 ఎస్‌ఐ, 23 ఏఎస్‌ఐ, 27 పీసీ డ్రైవర్స్‌, మెకానిక్‌ పోస్టులు ఉన్నాయి. భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండటంతో ఈ నియామకాలకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులకు తాజాగా మరో అవకాశం లభించింది.

Advertisement
Advertisement