త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi Chaitanya | ‘చెన్నై లవ్‌స్టోరీ’పై వైష్ణవి క్లారిటీ.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

Vaishnavi Chaitanya | కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా ‘చెన్నై లవ్‌స్టోరీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా క్లీన్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలుత కథానాయికగా వైష్ణవి చైతన్యను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

P

Entertainment | Published On Sep 8, 2026, 3.03 pm IST

Vaishnavi Chaitanya | ‘చెన్నై లవ్‌స్టోరీ’పై వైష్ణవి క్లారిటీ.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?
Advertisement

Vaishnavi Chaitanya | కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా ‘చెన్నై లవ్‌స్టోరీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా క్లీన్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలుత కథానాయికగా వైష్ణవి చైతన్యను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్‌గా నటించింది.  ఇటీవల ‘ఎపిక్‌’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న వైష్ణవి చైతన్యకు ‘చెన్నై లవ్‌స్టోరీ’లో ఎందుకు నటించలేకపోయారనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను మొదట్లో ఈ ప్రాజెక్ట్‌లో భాగమేనని స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో మరో సినిమాకు కమిట్‌ కావడంతో ‘చెన్నై లవ్‌స్టోరీ’కి డేట్స్‌ కేటాయించలేకపోయానని తెలిపింది.

‘అవును.. మొదట్లో నేను ఆ సినిమాలో భాగమే. ఆ సమయంలో మరో ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాను. ‘చెన్నై లవ్‌స్టోరీ’ మంచి విజయాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్నిసార్లు మనం మరో సినిమాకు కమిట్‌ అయి ఉండటం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్‌లో భాగం కాలేకపోతాం’ అని వైష్ణవి పేర్కొంది. తన మాటలతో ‘చెన్నై లవ్‌స్టోరీ’ నుంచి తాను తప్పుకోవడానికి ఎలాంటి ఇతర కారణాలు లేవని వైష్ణవి స్పష్టత ఇచ్చింది. కేవలం డేట్స్‌ సమస్య కారణంగానే ఈ సినిమాకు దూరమయ్యానని చెప్పకనే చెప్పింది. అదే సమయంలో సినిమా విజయంపై కూడా సంతోషం వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు వైష్ణవి స్థానంలో వచ్చిన శ్రీ గౌరీ ప్రియా తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. కిరణ్‌ అబ్బవరంతో కలిసి నటించిన ఈ రొమాంటిక్‌ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు.. బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. దీంతో ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా విజయంతో గౌరీ ప్రియా ఖాతాలో మరో మంచి మూవీ చేరిన‌ట్ల‌య్యింది.

Advertisement
Advertisement