Konda Surekha | సీఎం రేవంత్ పైనే చర్యలు తీసుకోండి : మంత్రి కొండా సురేఖ
Konda Surekha | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోవాల్సింది తనపై కాదు.. సీఎం రేవంత్‌పైనే చర్యలు తీసుకోండి అని ఆమె అధిష్టానానికి సూచించారు.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోవాల్సింది తనపై కాదు.. సీఎం రేవంత్‌పైనే చర్యలు తీసుకోండి అని ఆమె అధిష్టానానికి సూచించారు. రేవంత్ వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఇందిరా భవన్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం కొండా సురేఖ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
పదేళ్లపాటు నేనే సీఎంని అని రేవంత్ ఎలా అంటారు.. అది ఏ రకంగా సమర్థనీయం అని సురేఖ ప్రశ్నించారు. అవి క్రమశిక్షణ చర్యల కిందికి రావా..? అని నిలదీశారు. తదుపరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికన్నది రేవంత్ రెడ్డి ఎలా నిర్ణయిస్తారు.? సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎలా హామీ ఇస్తారు..? సీఎంకు ఏం హక్కు ఉందని అభ్యర్థిని ప్రకటిస్తారు అని కొండా సురేఖ నిలదీశారు.
నేనే కాదు.. సీఎం పనితీరుపై మంత్రులు, సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. నన్ను రాజీనామా చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. బీసీలకు ఒక న్యాయం.. ఇతర వర్గాల వారికి ఇంకో న్యాయమా..?నా కూతురిని రెచ్చగొట్టినందుకే విమర్శించింది.. అందరి మీదా ఫిర్యాదులున్నాయి. నా విషయాన్ని మాత్రమే సాగదీస్తున్నారు. సోనియా, రాహుల్, ఖర్గే, వేణుగోపాల్‌కు అన్ని విషయాలు మెయిల్ చేశాను. అధిష్టానం నన్ను వివరణ కోరలేదు. నాకు నేను గా వచ్చి కలిశాను. బెంగళూరులో ఖర్గేను కలిసినప్పుడే అన్నీ వివరంగా చెప్పాను అని కొండా సురేఖ తెలిపారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 4, 2026

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
సెప్టెంబర్ 4, 2026

Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే… మరి రాజగోపాల్‌రెడ్డి వెనకెవరున్నరు?
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



