Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు..
Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ఓ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ 9 నెలల చిన్నారి కూడా ఉంది. ఈ అనుమానాస్పద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Baingan Bharta | త్రినేత్ర.న్యూస్ : వంకాయ కూర తిన్నాక.. ఓ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ 9 నెలల చిన్నారి కూడా ఉంది. ఈ అనుమానాస్పద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఛతర్‌పూర్ జిల్లాలోని పిపోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన బాలముకుంద్ కుష్వాహాకు ముగ్గురు కుమార్తెలు.. పూనం(7), మనీషా(3), చహత్(9 నెలలు) ఉన్నారు. అయితే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు శుక్రవారం రాత్రి వంకాయ కూరను రోటీతో కలిపి తిన్నారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయం ముగ్గురు పిల్లలను ఖననం చేశారు. మొత్తానికి ఈ విషయం పోలీసులకు చేరింది.
దీంతో పోలీసులు పిపోరా ఖుర్ద్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పిల్లలు ఎలా చనిపోయారని విచారణ జరిపారు. అనుమానాస్పదంగా అమ్మాయిలు మృతి చెందడంతో.. మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆధారాలు సేకరించారు. అయితే, బాలికల మరణాలకు తిన్న ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పిల్లలు చనిపోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? లేక వంకాయ కూర తిన్న తర్వాతనే చనిపోయారా..? అన్న విషయాలు పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ తెలియదన్నారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. ముగ్గురు చిన్నారుల మరణాలకు దారితీసిన పరిస్థితులు అస్పష్టంగా, అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు.
తాజావార్తలు
- ●Tollywood | లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ లిరిసిస్ట్ - ధర వింటే షాకవ్వాల్సిందే?
- ●Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు
- ●Health Department | రాబోయే ఏడు రోజులు వర్షాలు.. ఆరోగ్య శాఖ అప్రమత్తం
- ●Hyderabad | టిప్పర్ - బైక్ ఢీ.. వ్యక్తి మృతి
- ●Bangladesh Hindu Family Dead | బంగ్లాదేశ్లో మిస్టరీ: తాళం వేసిన ఇంట్లో ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి.. అసలేం జరిగింది?
- ●Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

Tollywood | లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ లిరిసిస్ట్ - ధర వింటే షాకవ్వాల్సిందే?

Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు

Health Department | రాబోయే ఏడు రోజులు వర్షాలు.. ఆరోగ్య శాఖ అప్రమత్తం

Hyderabad | టిప్పర్ - బైక్ ఢీ.. వ్యక్తి మృతి






