త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ లిరిసిస్ట్ – ధ‌ర వింటే షాక‌వ్వాల్సిందే?

తెలుగు సినీ గేయ‌ర‌చ‌యిత చంద్ర‌బోస్ కొత్త కారు కొన్నారు. పోర్షే మ‌కాన్ మోడ‌ల్‌కు చెందిన ఈ కారు ధ‌ర కోటి ఇర‌వై ల‌క్ష‌ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. క‌ల నిజ‌మైందంటూ కొత్త కారుతో దిగిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చంద్ర‌బోస్ పోస్ట్ చేశారు.

N

Entertainment | Published On Aug 23, 2026, 7.42 pm IST

Tollywood |  లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ లిరిసిస్ట్ – ధ‌ర వింటే షాక‌వ్వాల్సిందే?
Advertisement

Tollywood | టాలీవుడ్ లిరిసిస్ట్‌ల‌లో చంద్ర‌బోస్ శైలి ప్ర‌త్యేకం. స‌ర‌ళ‌మైన ప‌దాల‌తో తెలుగు త‌నానికి పెద్ద‌పీట వేస్తూ పాట‌లు రాస్తుంటారు. చంద్ర‌బోస్ పాట‌ల‌తోనే హిట్ట‌యిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమా నుంచి వ‌స్తుందంటే లిరిసిస్ట్‌గా చంద్ర‌బోస్ ఉండాల్సిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప‌, రంగ‌స్థ‌లం, ఆర్య సినిమాలు బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచాయి.

ఆస్కార్ అవార్డ్‌...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు గాను చంద్ర‌బోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి ఇండియ‌న్ గేయ‌ర‌చ‌యిత‌గా చ‌రిత్ర‌ను సృష్టించాడు.

ధ‌ర ఎంతంటే?

లిరిసిస్ట్ చంద్ర‌బోస్ కొత్త కారు కొన్నారు. పోర్షే బ్రాండ్‌కు చెందిన మ‌కాన్ మోడ‌ల్‌కు చెందిన ఈ కారు ధ‌ర కోటి ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. గంట‌కు 232 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌డం ఈ కారు ప్ర‌త్యేక‌త‌. వంద కిలోమీట‌ర్ల స్పీడును కేవ‌లం ఆరు సెకండ్ల‌లోనే అందుకుంటుంది.

కొత్త కారుతో దిగిన వీడియోను చంద్ర‌బోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క‌ల నిజ‌మైందంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Chandrabose (@boselyricist)

Advertisement
Advertisement