Bangladesh Hindu Family Dead | బంగ్లాదేశ్‌లో మిస్టరీ: తాళం వేసిన ఇంట్లో ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి.. అసలేం జరిగింది?
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించింది. తాళం వేసిన ఇంట్లో అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇవే.
International | Published On Aug 23, 2026, 6.38 pm IST
- బంగ్లాదేశ్ రంగ్‌పూర్‌లో రిటైర్డ్ హిందూ టీచర్ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
- ఇంట్లోనే విగతజీవులుగా కనిపించిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు
- గురువారం నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్, శనివారం రాత్రి మృతదేహాల గుర్తింపు
- మెట్లపై తల్లీకూతురు, డాబాపై తండ్రి, మంచం కింద కొడుకు డెడ్‌బాడీలు లభ్యం
Bangladesh Hindu Family Dead | త్రినేత్ర.న్యూస్ : బంగ్లాదేశ్‌లోని (Bangladesh) రంగ్‌పూర్ నగరంలో దారుణం వెలుగుచూసింది. ఓ రిటైర్డ్ హిందూ స్కూల్ టీచర్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో దాస్‌పారా (Daspara) ఏరియాలోని వారి సొంతింట్లోనే ఈ మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
మృతులు ఎవరంటే?
మృతులను 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలతా (50), కూతురు అగామి (23), 12 ఏళ్ల కొడుకు ప్రియమ్‌గా గుర్తించారు. గణపతి గత ఏడాదే రంగ్‌పూర్ జిల్లా స్కూల్ నుంచి రిటైర్ అవ్వగా, కూతురు ఇంగ్లీష్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. కొడుకు ప్రియమ్ 5వ తరగతి చదువుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత గణపతి హోమియోపతి ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నారు.
మూడు రోజులుగా ఫోన్లు స్విచ్ఛాఫ్
గురువారం మధ్యాహ్నం వరకు బంధువులతో మాట్లాడిన ఈ ఫ్యామిలీ.. ఆ తర్వాత నుంచి ఎవరికీ టచ్‌లో లేదు. కుటుంబసభ్యులు వాడే నాలుగు మొబైల్ ఫోన్లు (Mobile phones) స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులకు అనుమానం వచ్చింది. శనివారం రాత్రి ఇంటికి వెళ్లి చూడగా.. మెయిన్ గేట్‌కు తాళం వేసి ఉంది. పోలీసుల సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురూ విగతజీవులుగా పడిఉన్నారు.
విస్మయానికి గురిచేస్తున్న క్రైమ్ సీన్
ఈ క్రైమ్ సీన్ (Crime scene) పోలీసులను సైతం ఆలోచనలో పడేసింది. తల్లీకూతుళ్ల డెడ్‌బాడీలు మెట్లపై ఉండగా, గణపతి మృతదేహం డాబాపై, చిన్నారి ప్రియమ్ బాడీ మంచం కింద దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి ఎలాంటి శత్రువులు లేరని, అందరితోనూ చాలా మంచిగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన సీఐడీ (CID), డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు అసలు ఈ మరణాల వెనుక కారణం ఏంటి? ఎవరు చంపారు? అనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
- ●Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
- ●Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
- ●CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్

Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి

Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్



