Health Department | రాబోయే ఏడు రోజులు వర్షాలు.. ఆరోగ్య శాఖ అప్రమత్తం
Health Department | రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Health Department | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
వైద్యారోగ్య శాఖ సూచనలివే..
- ప్రతి ఒక్కరూ కూడా తమ నివాసాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తలుపులకు, కిటికీలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
- ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.
- డొమెస్టిక్ సెప్టిక్ ట్యాంకుల వద్ద దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
- ప్రతి శుక్రవారం డ్రై డేగా పరిగణించాలన్నారు.
- ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఫిల్టర్ చేసిన నీటిని లేదా వేడి చేసిన నీళ్లను తాగాలని సూచించారు.
- ఆహారం తినే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.
- బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- దగ్గు, జలుబుతో బాధపడేవారు ఇతరులకు దూరంగా ఉండాలి.
- జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో బాధపడేవారు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad | టిప్పర్ - బైక్ ఢీ.. వ్యక్తి మృతి
- ●Bangladesh Hindu Family Dead | బంగ్లాదేశ్లో మిస్టరీ: తాళం వేసిన ఇంట్లో ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి.. అసలేం జరిగింది?
- ●Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
- ●Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
- ●Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

Hyderabad | టిప్పర్ - బైక్ ఢీ.. వ్యక్తి మృతి

Bangladesh Hindu Family Dead | బంగ్లాదేశ్లో మిస్టరీ: తాళం వేసిన ఇంట్లో ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి.. అసలేం జరిగింది?

Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి





