Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ప్రమాదం.. విమానాలను ఢీ కొన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ సర్వీస్ వాహనాలు అదుపుతప్పి టెర్మినల్-2 వద్ద నిలిపి ఉంచిన పలు విమానాలను ఢీ కొన్నాయి.
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులు, భారీ వర్షానికి (Rain, Storm) విమానాశ్రయం రన్‌వేపై గ్రౌండ్ సర్వీస్ వాహనాలు, ఇతర పరికరాలు (Ground Equipment) అదుపు తప్పాయి. టెర్మినల్-2 వద్ద నిలిపి ఉంచిన పలు విమానాలను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి.
అసలేం జరిగిందంటే.. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పెను గాలుల తీవ్రతకు ఎయిర్ పోర్టులోని గ్రౌండ్ సర్వీస్ వాహనాలు అదుపుతప్పాయి. అక్కడ పార్క్ చేసి ఉన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆ విమానాలు దెబ్బతిన్నాయి. ఆదివారం సాయంత్రం 4:40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఆ టైంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంటనే గమనించిన ఓ గ్రౌండ్ స్టాఫ్ అదుపు తప్పిన వాహనాలను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రాణాలకు తెగించి పరిగెత్తాడు. కానీ తుఫాను గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో వాటిని ఆపలేకపోయాడు. అందువల్ల కేవలం కొన్ని సెకన్లలోనే ఆ వాహనాలు విమానాలను బలంగా ఢీకొట్టాయి. దీనివల్ల ఆ విమానాలకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
HEART STOPPING MOMENT AT DELHI AIRPORT T2.
FIRST FOOTAGE.
3 Air India aircraft parked at Delhi Airport’s Terminal 2 were damaged after ground equipment broke loose during a sudden storm and slammed into the planes. Sources claim no prior ATC weather warning was issued to airlines… pic.twitter.com/c8Y9pl9RX9— Rahul Shivshankar (@RShivshankar) June 8, 2026
Also Read..
‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
పెంపు అనివార్యం.. ఎల్పీజీ సిలిండర్ ధరలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!






