Pralhad Joshi | పెంపు అనివార్యం.. ఎల్పీజీ సిలిండర్ ధరలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi | దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు (LPG Price Hike) క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుండగా, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు ఆదివారం పెంచాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థుల వల్ల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అనివార్యమని (Inevitable) కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) పేర్కొన్నారు.
Pralhad Joshi | త్రినేత్ర.న్యూస్: దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు (LPG Price Hike) క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుండగా, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు ఆదివారం పెంచాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) స్పందిస్తూ.. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థుల వల్ల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అనివార్యమని (Inevitable) పేర్కొన్నారు.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు పట్ల తాము కూడా చాలా బాధపడుతున్నామని వెల్లడించారు. అయితే విమర్శించేముందు ప్రతిఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సూచించారు. రవాణా ప్రక్రియలో చాలా ఆటంకాలు ఉన్నాయని, చాలా పరిమిత వనరుల నుంచే ఎల్‌పీజీ లభ్యమవుతున్నదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం తీవ్ర సంక్షభం ఎదుర్కొంటున్నదని చెప్పారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.
భారతదేశానికి చాలా దూరంగా ఉన్న దేశాల నుంచి కూడా సేకరణ జరుగుతున్నదని తెలిపారు. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, 40 నుంచి 45 రోజుల రవాణా సమయం కారణంగా బీమా ఖర్చులు కూడా పెరిగాయన్నారు. సామాన్యుల గురించి తమకు ఆందోళనగా ఉన్నప్పటికీ, ధరల పెంపు అనివార్యమని చెప్పారు. కాగా, ముడి చమురు ఉత్పత్తులపై భారత్ అధికభాగం విదేశాలపై ఆధారపడుతున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నెలకొన్నది. దీంతో ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.8, సీఎన్‌జీపై రూ.20, వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.29 మేర పెరిగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే
- ●CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
- ●Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్
- ●Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
- ●Nitin Nabin BJP | ధర్మేంద్ర ప్రధాన్ నిజాయతీకి నిదర్శనం : నితిన్ నబిన్

KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు - డైలాగ్ రైటర్ కామెంట్స్





