Boys Assault Couple | ముంబై పార్క్‌లో యువ జంటపై మైనర్ గ్యాంగ్ దాడి.. కర్రలతో చితకబాది..
Boys Assault Couple | ముంబైలోని కుర్లా ప్రాంతంలోని (Kurla West) ప్రమోద్ మహాజన్ గార్డెన్ (Pramod Mahajan Garden)లో యువ జంటపై ఓ మైనర్ గ్యాంగ్ దాడి చేసింది (Boys Assault Couple). కర్రలతో విచక్షణారహితంగా చితకబాదింది. దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు చర్యలు చేపట్టారు. మైనర్ బాలురపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
త్రినేత్ర న్యూస్ : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని కుర్లా ప్రాంతంలో (Kurla West) దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పబ్లిక్ పార్క్‌లో (Mumbai Park) యువ జంటపై ఓ మైనర్ గ్యాంగ్ దాడి చేసింది (Boys Assault Couple). కర్రలతో విచక్షణారహితంగా చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
కుర్లా వెస్ట్‌లోని ఫీనిక్స్ మాల్ (Phoenix mall) వెనుక ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్ (Pramod Mahajan Garden)లో ఈ ఘటన చోటు చేసుకుంది. యువ జంట పార్క్‌లో ఫొటోలు తీసుకుంటుండగా.. అక్కడికి వచ్చిన కొందరు మైనర్ బాలురు వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మైనర్ గ్యాంగ్, యువ జంట మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా మాటా మాటా పెరిగి భౌతిక దాడికి దారి తీసింది. 8 నుంచి 10 మంది బాలుర గ్యాంగ్ యువ జంటను చుట్టుముట్టి విచక్షణా రహితంగా దాడి చేసింది. కొందరు కర్రలతో చితకబాదగా.. మరికొందరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. దాడిని అడ్డుకునేందుకు యువతి ఎంత ప్రయత్నించినా.. ఆకతాయిలు ఆగలేదు. వారిని వెంబడించి మరీ దాడి చేశారు. చివరికి ఆ జంట ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పార్కు నుంచి బయటపడింది.
ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ఈ వీడియోను సుమోటోగా విచారణకు స్వీకరించిన పోలీసులు.. దాడికి పాల్పడిన మైనర్లను గుర్తించి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న 8 మంది మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు (Juvenile Justice Board) ముందు హాజరుపరుస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, నిందితుల తల్లిదండ్రులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీ నేత కిరీట్ సోమయ్య (Kirit Somaiya) తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనను "ముస్లిం గూండాయిజం"గా అభివర్ణించారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో పౌరులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ముంబై పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
EIGHT MINORS DETAINED AFTER COUPLE ASSAULT IN MUMBAI PARK !!!
A young couple was attacked by a group of boys at Pramod Mahajan Garden in Kurla. According to police the group made objectionable remarks while the couple were taking photographs which followed an argument and both were assaulted.
Ghatkopar Police registered a case and detained those 8 minors and they are to be produced before the Juvenile Justice Board.
@MumbaiPolice @DGPMaharashtra
— Ravi Prakash Official (@raviprakash_rtv) November 21, 2026
Also Read..
వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
నిజామాబాద్‌లో నితిన్ నబీన్ మహా పాదయాత్ర రద్దు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు జారీ.. 2008లోపు జన్మించాలి
తాజావార్తలు
- ●Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ
- ●AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
- ●MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా
- ●IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..
- ●Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!
- ●PM Modi Gamcha Swirl Vaishali | ఓపెన్ వాహనంలో మోదీ 'గమ్చా' మేనియా.. గంగా నదిపై భారీ బ్రిడ్జికి 'నితీశ్ సేతు' పేరు

Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ

AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా

IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..



