త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravan Baba | 400 ఏళ్లుగా.. ఆ గ్రామానికి రావ‌ణుడే దేవుడు..!

Ravan Baba | దేశ‌మంతా ద‌స‌రా( Dasara ) పండుగ సంద‌ర్భంగా రావ‌ణ ద‌హ‌నం చేస్తారు. కానీ ఈ గ్రామంలో భిన్న‌మైన ప‌రిస్థితి. రావ‌ణుడినే దేవుడిగా పూజిస్తారు. ఆ గ్రామ‌స్తుల ఇంటి దైవంగా మారిపోయాడు రావ‌ణుడు( Ravan Baba ). ఆ గ్రామంలో కొలువైన రావ‌ణ ఆల‌యంలో నిత్యం పూజ‌లు జ‌రుగుతుంటాయి.

S

National | Published On Oct 20, 2026, 8.27 am IST

Ravan Baba | 400 ఏళ్లుగా.. ఆ గ్రామానికి రావ‌ణుడే దేవుడు..!
Advertisement

Ravan Baba | త్రినేత్ర న్యూస్ : దేశ‌మంతా ద‌స‌రా( Dasara ) పండుగ సంద‌ర్భంగా రావ‌ణ ద‌హ‌నం చేస్తారు. కానీ ఈ గ్రామంలో భిన్న‌మైన ప‌రిస్థితి. రావ‌ణుడినే దేవుడిగా పూజిస్తారు. ఆ గ్రామ‌స్తుల ఇంటి దైవంగా మారిపోయాడు రావ‌ణుడు( Ravan Baba ). ఆ గ్రామంలో కొలువైన రావ‌ణ ఆల‌యంలో నిత్యం పూజ‌లు జ‌రుగుతుంటాయి. ఏ శుభ‌కార్యం జ‌రిగినా రావ‌ణుడిని పూజించాల్సిందే. మ‌రి ఆ గ్రామం ఎక్క‌డుందంటే..?

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌( Madhya Pradesh )లోని న‌టేరాణ్ రెవెన్యూ ప‌రిధిలోని విదిషా గ్రామం అది. ఆ గ్రామంలో అడుగుపెట్టామంటే చాలు.. ప్ర‌తి ఇంటి వ‌ద్ద రావ‌ణ్ బాబా అనే పేరు క‌నిపిస్తోంది. ప్ర‌తి వాహ‌నంపై కూడా ఈ పేరు ఉంటుంది. అంతేకాదు.. యువ‌కులు, భ‌క్తులు త‌మ చేతుల‌పై రావ‌ణ్ బాబా అని టాటూలు వేయించుకున్నారు.

ఎందుకింత ప్ర‌త్యేక‌త‌..?

ఈ సంద‌ర్భంగా విదిషా గ్రామానికి చెందిన విశ్వ‌నాథ్ మిశ్రా మాట్లాడుతూ.. మా పూర్వీకుల కాలం నుంచి మా గ్రామంలో రావ‌ణుడిని దేవుడిగా పూజిస్తున్నాం. మా గ్రామంలో ఎలాంటి శుభ‌కార్యం జ‌రిగినా ముందు రావ‌ణుడిని పూజిస్తాం. ఆ త‌ర్వాతే మిగ‌తా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం. అంతేకాదు.. గ్రామంలో ఎవ‌రూ కొత్త వాహ‌నం కొనుగోలు చేసినా.. దానిపై రావ‌ణ్ బాబా అని రాయాల్సిందే. లంకాధిప‌తి అయిన రావ‌ణ్ బాబానే త‌మ గ్రామానికి రక్ష‌ణ‌గా నిలుస్తున్నాడు. ఈ ఆచారం గ‌త 400 ఏళ్ల నుంచి కొన‌సాగుతూ వ‌స్తుంద‌ని విశ్వ‌నాథ్ తెలిపాడు.

అధికారుల వాహ‌నాల‌కు మంట‌లు

గ‌తంలో త‌మ గ్రామంలో రావ‌ణాసురుడిని పూజిస్తున్నామ‌ని తెలిసి.. ఆర్కియాల‌జిక‌ల్ అధికారులు వ‌చ్చార‌ట‌. 12 అడుగుల పొడ‌వు ఉండి నేల‌పై ప‌డుకుని ఉన్న రావ‌ణ విగ్ర‌హాన్ని త‌ర‌లించేందుకు అధికారులు య‌త్నించారట‌. ఆ స‌మ‌యంలో అధికారుల వాహ‌నాల్లో మంట‌లు చెల‌రేగాయ‌ని త‌మ పూర్వీకులు చెబుతుంటారు.. దాంతో అధికారులు ఏదో శ‌క్తి ఉంద‌ని చెప్పి విగ్ర‌హాన్ని ఇక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయార‌ని త‌మ పూర్వీకులు చెప్పిన‌ట్లు విశ్వ‌నాథ్ మిశ్రా గుర్తు చేశారు.

Advertisement
Advertisement