త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | నీళ్లు పోతున్న‌ది నిజ‌మే.. ఎత్తాలంటే 93.50 మీట‌ర్లు ఉండాలే

Chamala Kirankumar Reddy | క‌న్నేప‌ల్లి (Kannepally) నుంచి మేడిగ‌డ్డ‌ (Medigadda)లో నీళ్లు ఎత్తిపోయాలంటే 93.50 మీట‌ర్ల ఎత్తులో నీళ్లు ఉండాల‌ని.. కానీ 89 మీట‌ర్ల ఎత్తులోనే నీళ్లు ఉన్నాయని భువ‌నగిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) తెలిపారు.

S

Telangana | Published On Oct 26, 2026, 1.38 pm IST

Chamala Kirankumar Reddy | నీళ్లు పోతున్న‌ది నిజ‌మే.. ఎత్తాలంటే 93.50 మీట‌ర్లు ఉండాలే
Advertisement
  • - కానీ ఎత్తే ప‌రిస్థితి లేదు.. ఒక‌వేళ‌ ఎత్తినా మేడిగ‌డ్డ‌ల నిల్వ చేయ‌లేం
  • గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ప్ర‌తి చుక్క‌ను వాడుకోలేక‌పోతున్నం
  • కేటీఆర్‌వి దిమాక్ లేని మాట‌లు.. పిచ్చి పిచ్చిగా వాగుతున్న‌డు
  • భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: క‌న్నేప‌ల్లి (Kannepally) నుంచి మేడిగ‌డ్డ‌ (Medigadda)లో నీళ్లు ఎత్తిపోయాలంటే 93.50 మీట‌ర్ల ఎత్తులో నీళ్లు ఉండాల‌ని.. కానీ 89 మీట‌ర్ల ఎత్తులోనే నీళ్లు ఉన్నాయని భువ‌నగిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) తెలిపారు. పంపులు ప‌నిచేయ‌వ‌ని.. నీళ్లు ఎత్తే ప‌రిస్థితి లేద‌న్నారు. అన్నారం, సుందిళ్ల‌ల పోయాల‌న్నా సేమ్ వాట‌ర్ ఉండాలన్నారు. ఒక‌వేళ ఎత్తినా మేడిగ‌డ్డ‌ల నిల్వ చేసే ప‌రిస్థితి లేద‌న్నారు. కుంగిన మేడిగ‌డ్డ పోస్తే ఊర్ల‌కు ఊర్లే కొట్టుకుపోతాయ‌ని ఎన్‌డీఎస్ఏ చెప్పింద‌ని గుర్తు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల‌నే నీళ్ల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతున్నామ‌ని విమ‌ర్శించారు.

ఊర్లు కొట్టుక‌పోత‌య‌ని ఎన్‌డీఎస్ఏ చెప్పింది

క‌న్నేప‌ల్లి నుంచి మేడిగ‌డ్డ‌ల‌లో నీళ్లు ఎత్తి పోయాలంటే 93.50 మీట‌ర్ల ఎత్తుల నీళ్లు ఉండాలే. నీళ్లు పోతున్న‌య్ నిజ‌మే. ఉన్న‌దెంతా అంటే 89 మీట‌ర్లే. అంటే నీళ్లు ఎత్త‌లేని ప‌రిస్థితి ఉంది. మోటార్ల‌కు అంద‌య్ క‌దా. పంపులు ప‌ని చేయ‌వ్‌. అన్నారం, సుందిళ్ల‌ల పోయాల‌న్నా సేమ్ వాట‌ర్ ఉండాలే. ఎత్తిపోసింది ఒకెత్త‌యితే.. ఎత్తిన త‌ర్వాత మేడిగ‌డ్డ‌ల నిల్వ చేసే ప‌రిస్థితి లేదు క‌దా. మేడిగ‌డ్డ కుంగిపోయింది. అండ్ల పోస్తే ఊర్ల‌కు ఊర్లు కొట్టుకునిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఎన్‌డీఎస్ఏ ఏం చెప్పింది. గ‌త ప్ర‌భుత్వ వ్యవ‌హారం వ‌ల్ల‌నే ప్ర‌తి చుక్క నీళ్ల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతున్నం.. అది కృష్ణా అయినా గోదావ‌రి అయినా.

ఎటువెట్టి ప్ర‌భుత్వం మీద‌ నిందలు వేయాల‌ని బీఆర్ఎస్ వాళ్లు అనుకుంటున్న‌రు. వాళ్ల‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌లేదు కాబ‌ట్టి క‌రువు రావాల‌ని దేవున్ని కోరుకుంటున్న‌రు. ఉన్న ప్ర‌భుత్వాన్ని నింద‌ల పాలు చేయొచ్చు. పిట్ట క‌థ‌లు చెప్పొచ్చు.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించొచ్చు. కేటీఆర్ దిమాక్‌లేని మాట‌లు మాట్లాడుతున్న‌రు.

నువ్ గ‌డ్డం పెంచి గోసి చెక్కుకున్నా నిన్ను న‌మ్మ‌రు

నిధులు, నీళ్లు, నియామ‌కాల నినాదంతో వ‌చ్చిన వీళ్లు ఈరోజు సుద్ద‌పూస మాట‌లు మాట్లాడుతున్న‌రు. తెలంగాణల కృష్ణా, గోదావ‌రి జ‌లాల ప‌రిస్థితి ఏందో ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పు అయింది. వాళ్లు ఒప్పుకున్న 299 టీఎంసీల నీళ్లు నిల్వ చేయ‌డానికి కూడా రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్ట‌ని ద‌రిద్రులు వీళ్లు. భూసేక‌రణ‌ చేయ‌లే.. స‌రైన విధంగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌లే. కాళేశ్వ‌రం క‌ట్టినా ఒక్క ఎక‌రానికి నీళ్లిచ్చిన దాఖ‌లాలు లేవ్‌. ఈరోజొచ్చి పిచ్చి పిచ్చి మాట‌లు మాట్లాడుతున్న‌రు. ఏదో గ‌డ్డం పెంచి పెద్ద మ‌నిషైనా ప్ర‌జ‌లు న‌న్ను న‌మ్ముత‌రు అనుకుంటుండు. కేటీఆర్‌! నువ్ గ‌డ్డం పెంచి గోసి చెక్కుకున్నా ప్ర‌జ‌లు నిన్ను న‌మ్మ‌రు.

ఎల్‌నినో కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో వంద దేశాల్లో ఎల్‌నినో సమస్య వచ్చింది. ఎల్‌నినో ప్రభావాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు. వారు కట్టిన ప్రాజెక్టులు కూలడం వల్లే ఈ సమస్యలు వచ్చిన‌య్‌. వర్షాలు పడక భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయి. విపక్షాలు మేడిగడ్డ నుంచి నేరుగా ఏపీకి నీళ్లు వెళ్తున్నాయనే దుష్ప్రచారం చేస్తున్నారు అని చామ‌ల మండిప‌డ్డారు.

Advertisement
Advertisement