త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Dhanush | వెండి దీపాల‌పై క‌మ‌లం గుర్తు.. ధ‌నుష్ పొలిటిక‌ల్ ఎంట్రీ వెనుక బీజేపీ మ‌ద్ద‌తు..?

Actor Dhanush | త‌మిళ స్టార్ ధ‌నుష్ (Actor Dhanush) త‌న మ‌హిళా అభిమానుల‌కు కానుక‌గా ఇచ్చిన వెండి దీపాల‌పై క‌మ‌లం గుర్తు (Lotus on silver lamps) ఉండ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ధ‌నుష్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు బీజేపీ తెర‌వెనుక మ‌ద్ద‌తు ఇస్తోందంటూ ప్ర‌చారం మొద‌లైంది.

D

National | Published On Oct 26, 2026, 2.00 pm IST

Actor Dhanush | వెండి దీపాల‌పై క‌మ‌లం గుర్తు.. ధ‌నుష్ పొలిటిక‌ల్ ఎంట్రీ వెనుక బీజేపీ మ‌ద్ద‌తు..?
Advertisement

Actor Dhanush | త్రినేత్ర న్యూస్ : త‌మిళ స్టార్ ధ‌నుష్ (Actor Dhanush) రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు త‌మిళ‌నాట‌ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌చారం వేళ ఆయ‌న నిన్న చెన్నైలో త‌న అభిమాన సంఘం మ‌హిళా విభాగంతో (women functionaries) ప్ర‌త్యేకంగా స‌మావేశమ‌య్యారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 నుంచి 5,000 మంది మ‌హిళ‌లు హాజ‌ర‌య్యారు. వారంద‌రితో ధ‌నుష్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారితో ఫొటోలు కూడా దిగారు. రానున్న దీపావ‌ళి సంద‌ర్భంగా వారంద‌రికీ వెండి దీపాల‌ను ధ‌నుష్ కానుక‌గా ఇచ్చారు.

అయితే, ఆ దీపాల‌పై ఉన్న ఓ గుర్తు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల గుర్తు అయిన తామ‌ర పువ్వు (క‌మ‌లం) ముద్ర ఉండ‌టం సంచ‌ల‌నం (Lotus on silver lamps) రేపుతోంది. ధ‌నుష్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు బీజేపీ తెర‌వెనుక మ‌ద్ద‌తు ఇస్తోందంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో కానుక‌ల‌పై క‌మ‌లం గుర్తు ఉండ‌టంపై ధ‌నుష్ అభిమాన సంఘం న‌ర్ప‌ణి ఇయ‌క్క‌మ్ (Narpani Iyakkam) క్లారిటీ ఇచ్చింది. మ‌హిళా అభిమానుల‌కు కానుక‌గా ఇచ్చిన వెండి దీపాల‌పై ఉన్న క‌మ‌లం గుర్తు కేవ‌లం త‌యారీదారుడి ముద్ర మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో ఎలాంటి రాజ‌కీయ కోణం లేద‌ని వెల్ల‌డించింది.

విజ‌య్ బాట‌లోనే త‌మిళ‌నాట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు ధ‌నుష్ సన్నాహాలు చేస్తున్న‌ట్లు గ‌త‌కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న ‘తమిళగ ఎళుచ్చి కళగం (Thamizhaga Ezhuchi Kazhagam) పేరుతో పార్టీ పేరును ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద రిజిస్టర్ చేయించినట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్ర‌చారం ఊపందుకుంది. ఈ విష‌యంపై ధ‌నుష్ త‌న మామ అయిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ను కూడా సంప్ర‌దించి మ‌ద్ద‌తు కోరిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ధ‌నుష్ 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న‌ట్లు త‌మిళ మీడియాలో వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. పొలిటిక‌ల్ ఎంట్రీపై ధ‌నుష్ త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read..

మైనారిటీల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు మౌనం ఎందుకు..? : ఒవైసీ

అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. ప‌రువు న‌ష్టం కేసు కొట్టివేత‌

భారత మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారుల భారీ నిష్క్రమణ.. 2026లో రూ.3.08 లక్షల కోట్లు వెనక్కి..

Advertisement
Advertisement