త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Leaders | ప్రైవేట్ వెబ్‌సైట్‌లో గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తున్నారు.. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు బీఆర్ఎస్ నేత‌ల ఫిర్యాదు

BRS Leaders | ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ (Bharath Kumar), కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవి ప్రసాద్ (Devi Prasad), బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ (Kishore Goud) ఆరోపించారు.

S

Telangana | Published On Oct 26, 2026, 2.08 pm IST

BRS Leaders | ప్రైవేట్ వెబ్‌సైట్‌లో గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తున్నారు.. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు బీఆర్ఎస్ నేత‌ల ఫిర్యాదు
Advertisement

BRS Leaders | త్రినేత్ర న్యూస్‌: ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (Khammam-Nalgonda-Warangal Graduate MLC Election)  ఓట్ల నమోదు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ (Bharath Kumar), కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవి ప్రసాద్ (Devi Prasad), బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ (Kishore Goud) ఆరోపించారు. ప్రైవేట్ వెబ్‌సైట్ ద్వారా ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇది ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌న్నారు. ఈమేర‌కు సోమ‌వారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. స‌ర్వోత్త‌మ్ రెడ్డి ప్రైవేట్ వెబ్‌సైట్ ద్వారా ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. ఓట‌ర్లుగా న‌మోద‌య్యే వారికి ద‌ర‌ఖాస్తు తీసుకున్నామ‌నే ర‌సీదు ప‌ట్ట‌భ‌ద్రుల‌కు వెళ్ల‌డం లేదు. ఈర‌కంగా చేయ‌డానికి ప్రైవేట్ వెబ్‌సైట్ల‌కు హ‌క్కు లేదు. ఆధార్ కార్డ్‌ లాంటి ప‌ర్స‌న‌ల్ స‌మాచారాన్ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌లాంటి అథారిటీస్ మాత్ర‌మే తీసుకోవాలి. ఈ స‌మాచారం అంతా ఎల‌క్ష‌న్ మాల్‌ప్రాక్టీస్ కోసం దుర్వినియోగ‌ప‌ర‌చ‌డానికి అవ‌కాశం ఉంది. వీట‌న్నింటిపై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాం. ప‌రిశోధించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

దొంగ ఓట్ల‌ను న‌మోదు చేయిస్తున్న‌ట్లు స‌మాచారం ఉంది..

కాంగ్రెస్ వాళ్ల‌వే న‌మోదు చేయండని ఇటీవ‌ల మీటింగుల్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్ప‌డం స‌రైంది కాదు. కాంగ్రెస్ నాయ‌కులు గ్రాడ్యుయేట్ల నుంచి బల‌వంతంగా స‌మాచారం తీసుకుని వారికి తెలియ‌కుండానే అన్ని చేస్తున్నారు. దీనిపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వివ‌రించాం. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు జ‌ర‌గాలి. దొంగ ఓట్ల‌ను న‌మోదు చేయిస్తున్న‌ట్లు మాకు స‌మాచారం ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే పౌరుల ఓటు హ‌క్కు విష‌యంలో తీవ్ర విఘాతం క‌లిగే అవ‌కాశం ఉంది. ఓటు వేయ‌కుంటే బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డే అవ‌కాశం ఉంట‌ది. వీటిని నిరోధించాలి. గ్రాడ్యుయేట్ల‌కు స్వేచ్ఛ‌నివ్వాలి అని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement