స్టార్ హీరోలతో సినిమాలు – రెమ్యూనరేషన్లలో వివాదాలు – ఎవరీ 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు?
14 రీల్స్ ప్లస్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట
అఖండ 2 వాయిదాతో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలను బాలకృష్ణ ఫ్యాన్స్ ఓ అటాడుకుంటున్నారు. చివరి నిమిషంలో ఈ సినిమాను వాయిదా వేయడంపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. బాలకృష్ణ ఎంతో కష్టపడి మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో ఈ సినిమా చేశాడని, అతడి కష్టం మొత్తం వృథా అయ్యిందని ఫైర్ అవుతున్నారు. రిలీజ్ చేయడమే రానప్పుడు సినిమా ఎందుకు తీశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అఖండ 2 వాయిదాతో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యానర్ ఎవరిది? గతంలో వీరు ఈ సినిమాలు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా 14 రీల్స్‌కు వివాదాలు కొత్తేం కాదని కొందరు చెబుతున్నారు. మహేష్‌బాబు, నాగచైతన్య, శర్వానంద్ వంటి హీరోలతో విభేదాలు తలెత్తాయి. రెమ్యూనరేషన్ల విషయంలో ఈ నిర్మాతలపై గతంలో ఛాంబర్‌లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌కు రామ్ ఆచంట, గోపీ ఆంచట అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ పేరుతో బ్యానర్ నెలకొల్పిన వీరు మరో నిర్మాత అనిల్ సుంకరతో కలిసి స్టార్ హీరోలతో పలు సినిమాలు చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన నమో వెంకటేషతో నిర్మాతలుగా వీరి సినీ ప్రయాణం ప్రారంభమైంది. మహేష్‌బాబు వన్ నేనొక్కడినే, ఆగడు, బాలకృష్ణ లెజెండ్, నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ, రామ్ పోతినేని హైపర్, నితిన్ లై సినిమాలను నిర్మించారు.
లెజెండ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ మినహా మిగిలిన సినిమాలేవి విజయాలను సాధించలేదు. ఈ నష్టాలతో తమ బ్యానర్ పేరును 14 రీల్స్ ప్లస్‌గా మార్చారు. అనిల్ సుంకర నించి విడిపోయి మహేష్‌బాబుతో సొంతంగా సర్కారు వారి పాట సినిమాను రూపొందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈసినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత చేసిన వాల్మీకి పర్వాలేదనిపించగా శ్రీకారం డిజాస్టర్ అయ్యింది. ఇప్పటివరకు రామ్ ఆచంట, గోపీ ఆచంట పదికిపైగా సినిమాలు చేయగా వీటిలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి.
శ్రీకారం సినిమాకు తనకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని 14 రీల్స్ నిర్మాతలకు కోర్టు ద్వారా అప్పట్లో హీరో శర్వానంద్ నోటీసులు పంపించాడు. నిర్మాతలు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో శర్వానంద్ కోర్టుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఆగడు, సర్కారువారి పాట రెమ్యూనరేషన్ల విషయంలో మహేష్‌బాబుతో విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత వాటిని సెటిల్ చేసుకున్నారు. నాగచైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టి ఆపేశారు. ఈ విషయంలో నాగచైతన్య గట్టిగానే హర్టయ్యాడు. తాజాగా అఖండ 2తో మరోసారి అడ్డంగా బుక్కయ్యారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!



