Makutam Movie | విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రేపే ట్రైలర్ విడుదల
Makutam Release date | సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. దివంగత ఆర్‌బీ చౌదరి సమర్పణలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.
Makutam Movie | త్రినేత్ర.న్యూస్: సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. దివంగత ఆర్‌బీ చౌదరి సమర్పణలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్లు ప్రకటించారు. రేపు ట్రైలర్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు.
ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, N.B. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక ఈ మూవీని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు : విశాల్, అంజలి, దుషార విజయన్, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు
టెక్నికల్ టీం:
నిర్మాణం: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు: బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా
సమర్పణ : R.B. చౌదరి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విశాల్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: జి. దురైరాజ్
యాక్షన్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్
ఎడిటర్: N.B. శ్రీకాంత్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు




