త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharathiraja | త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా క‌న్నుమూత‌..

Bharathiraja | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, న‌టుడు భార‌తీ రాజా (Bharathiraja) క‌న్నుమూశారు. 85 ఏండ్ల భార‌తీ రాజా గ‌త కొంత‌కాలంగా శ్వాస సంబంధింత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

G

Movies | Published On Jun 10, 2026, 8.28 am IST

Bharathiraja | త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా క‌న్నుమూత‌..
Advertisement

Bharathiraja | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, న‌టుడు భార‌తీ రాజా (Bharathiraja) క‌న్నుమూశారు. 85 ఏండ్ల భార‌తీ రాజా గ‌త కొంత‌కాలంగా శ్వాస సంబంధింత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చెన్నైలోని ద‌వాఖానాలో చికిత్స పొందుతూ బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. 1941 జూలై 17న జన్మించారు. ఆయ‌న తెర‌కెక్కించిన‌ పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. భార‌తీరాజా ద‌ర్శ‌కుడిగానే కాకుండా న‌టుడిగా కూడా ప‌లు చిత్రాల్లో ఆక‌ట్టుకున్నారు.

అస‌లుపేరు చిన్న‌సామి..

1941, జూలై 17న త‌మిళ‌నాడు తేని జిల్లా అల్లినగరంలో జ‌న్మించారు. ఆయ‌న అస‌లుపేరు చిన్న‌సామి. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత భార‌తీరాజాగా మార్చుకున్నారు. 1977లో విడుద‌లైన‌ 16 వ‌యాతినిలే (ప‌ద‌హారేళ్ల వ‌య‌సు) చిత్రంతో ఆయ‌న దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. త‌న సినిమాల్లో గ్రామీణ జీవితాన్ని అత్యంత వాస్త‌వికంగా ఆవిష్క‌రించారు. ప‌ల్లె అందాల‌ను వెండితెర‌పై అద్భుతంగా చూపించ‌డంతో ఇయ‌క్కునార్ ఇమ‌యం (ద‌ర్శ‌కత్వ శిఖ‌రం)గా పేరుగాంచారు. రాధా, రాధికా, రేవతి, కార్తీక్ వంటి ఎందరో కొత్త నటీనటులను చిత్రీసీమ‌కు పరిచయం చేశారు.

తెలుగులోనూ..

తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులు. ఆయన దర్శకత్వం వహించిన 'సీతాకోకచిలుక' సినిమా తెలుగులో క్లాసిక్‌గా నిలిచింది. అంతేకాకుండా 'మంగమ్మగారి మనవడు' చిత్రానికి కథను, 'పల్నాటి పౌరుషం' చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన మెప్పించారు. యువ, ఈశ్వరన్, తిరు, మహారాజా వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్' ఆయన చివరి చిత్రం.

జాతీయ అవార్డులు.. 

ఆయ‌న ప్ర‌తిభ‌కుగాను ఎన్నో అవార్డులు ల‌భించాయి. 2004లో భారత ప్రభుత్వం నుంచి ప‌ద్మ‌శ్రీ పురస్కారం అందుకున్నారు. ఆరు సార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. `సీతాకోకచిలుక` చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. వీటితో పాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఆరు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు సాధించారు.

Advertisement
Advertisement