త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేష‌న్ …. వినాయ‌క‌చ‌వితి రోజు ఫొటోతో క‌న్ఫామ్ చేసిన తెలుగు డైరెక్ట‌ర్

హీరోయిన్ ఈషారెబ్బా, డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లో వీరిద్ద‌రు పెళ్లిచేసుకోబోతున్నారంటూ గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమ‌ర్ల న‌డుమ వినాయ‌క‌చ‌వితి రోజు త‌రుణ్ భాస్క‌ర్ పెట్టిన ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోతో ఈషారెబ్బాతో త‌న ల‌వ్‌స్టోరీని త‌రుణ్ భాస్క‌ర్ క‌న్ఫామ్ చేశాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.

N

News | Published On Sep 14, 2026, 5.08 pm IST

Eesha Rebba | హీరోయిన్‌తో రిలేష‌న్ …. వినాయ‌క‌చ‌వితి రోజు ఫొటోతో క‌న్ఫామ్ చేసిన తెలుగు డైరెక్ట‌ర్
Advertisement

Eesha Rebba | డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌, హీరోయిన్ ఇషారెబ్బా ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రు జంట‌గా ప‌లుమార్లు మీడియా కంట ప‌డ్డారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ పెళ్లి వేడుక కోసం రాజ‌స్థాన్‌కు త‌రుణ్ భాస్క‌ర్‌తోనే వెళ్లింది ఇషారెబ్బా. గ‌త ఏడాది హీరో విశ్వ‌క్‌సేన్ ఇంట్లో జ‌రిగిన దీపావ‌ళికి వేడుక‌లో వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించారు.

వినాయ‌క‌చ‌వితి...

గ‌త రెండేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల న‌డుమ వినాయ‌క‌చ‌వితి రోజు త‌రుణ్ భాస్క‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. ఇషారెబ్బాతో క‌లిసి త‌రుణ్ భాస్క‌ర్ ఓ ఫొటో దిగాడు. ఈ ఫొటోకు స్మైలింగ్ ఫేస్ ఎమోజీని జోడించాడు. వారి వెనుక వినాయ‌కుడి విగ్ర‌హం ఉంది. ఇద్ద‌రూ క‌లిసే వినాయ‌కుడి పూజ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.
ఈ ఫొటోతో ఇషారెబ్బాతో త‌న ప్రేమాయ‌ణం, పెళ్లిని త‌రుణ్ భాస్క‌ర్ క‌న్ఫామ్ చేశాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నార‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు.

కావ్య క‌ళ్యాణ్ రామ్‌...

త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా ఫొటోను ఉద్దేశించి కావ్య క‌ళ్యాణ్ రామ్ కామెంట్ పెట్టింది. పండ‌గ రోజు మంచి పులిహోర తిన్న ఫీల్ ఉంది ఈ ఫొటోలో అని అన్న‌ది. శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, షాలిని కొండెపూడితో పాటు మ‌రికొంద‌రు హీరోయిన్లు కూడా ల‌వ్ ఎమోజీల‌తో కామెంట్లు పెట్టారు. ఈ ఫొటోకు నాలుగు గంట‌ల్లోనే అర‌వై వేల వ‌ర‌కు లైక్స్ వ‌చ్చాయి.

ఓం శాంతి శాంతి శాంతి...

త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషారెబ్బా క‌లిసి ఓ శాంతి శాంతి శాంతి అనే సినిమా చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. అంత‌కుముందు ఆ త‌ర్వాత సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా. అ!, ద‌ర్శ‌కుడు, అమీతుమీ, బ్రాండ్‌బాబు, మామామ‌శ్చీంద్ర‌తో మ‌రికొన్ని సినిమాలు చేసింది. హీరోయిన్‌గా ఈ సినిమాల‌తో మంచి పేరొచ్చిన విజ‌యాలు మాత్రం ద‌క్క‌లేదు.

పెళ్లిచూపులు...

పెళ్లిచూపులు మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు త‌రుణ్ భాస్క‌ర్‌. తొలి సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డును అందుకున్నాడు. పెళ్లిచూపులు త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది, కీడాకోలా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మీకు మాత్ర‌మే చెప్తా, గాయ‌ప‌డ్డ సింహం సినిమాల్లో హీరోగా న‌టించాడు. సంతాన ప్రాప్తిర‌స్తు, మంగ‌ళ‌వారంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా ఈ న‌గ‌రానికి ఏమైంది 2ను తెర‌కెక్కిస్తున్నాడు. డైరెక్ట‌ర్‌గా మార‌డానికి ముందే ల‌తా నాయుడుతో త‌రుణ్ భాస్క‌ర్‌కు పెళ్లి జ‌రిగింది. విభేదాల కార‌ణంగా భార్య నుంచి విడిపోయాడు.

.

Advertisement
Advertisement