Bharathi Raja | భారతీరాజా కుటుంబంలో ఆస్తి తగాదాలు – దర్శకుడి మొత్తం సంపాదన ఎన్ని వందల కోట్లు అంటే?
ఇటీవల కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలైనట్లు తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారతీరాజా పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించిన హక్కుల విషయంలో ఆయన కూతురు, కోడలికి మధ్య వివాదం నడుస్తోన్నట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Jun 14, 2026, 8.55 pm IST
Bharathi Raja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా అనారోగ్య సమస్యలతో ఇటీవలే కన్నుమూశారు. దిగ్గజ దర్శకుడి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గత ఏడాది భారతీరాజా కుమారుడు మనోజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కొడుకు మరణంతో కుంగిపోయిన భారతీరాజా ఆ మనోవేదనతోనే తుది శ్వాస విడిచారు.
కొడుకు...కూతురు...
కాగా భారతీరాజా మరణం తర్వాత ఆయన కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలైనట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ దర్శకుడి అంత్యక్రియల్లోనే గొడవ జరిగినట్లు సమాచారం. భారతీరాజాకు కొడుకు మనోజ్‌తో పాటు కూతురు జనని అన్నారు. మనోజ్ మలయాళ నటి నందనను పెళ్లి చేసుకున్నాడు. కూతురు జనని భర్తతో కలిసి మలేషియాలో సెటిలైందట.
ఒంటరిగా భారతీరాజా
కొడుకు మరణం తర్వాత చెన్నైలోని నీలాంగరైలో ఉన్న ఇంటిలో భారతీరాజా ఒంటరిగా ఉన్నారట. ఆయన బాగోగులు నర్సులతో పాటు పనిమనుషులే చూసుకున్నారట. భారతీరాజాకు చెందిన ఓ ఫ్లాట్‌లో మనోజ్ భార్య నందనతో పాటు ఆమె కూతుళ్లు ఉంటున్నారట. ఆ ఫ్లాట్ తనదేనని, దానిని ఖాళీ చేయాలని మనోజ్ భార్యతో పాటు ఆమె కూతుళ్లపై భారతీరాజా కూతురు జనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.మరోవైపు తండ్రి ఆస్తులను జనని అక్రమంగా తన పేరిట రాయించుకున్నట్లు నందన ఆరోపిస్తోన్నట్లు తెలిసింది.
అంత్యక్రియల్లో గొడవలు...
భారతీరాజా అంత్యక్రియలకు వచ్చిన కోడలితో పాటు మనవరాళ్లను కూడా జనని అడ్డుకొని వెళ్లిపోవాలని వాదించినట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. రాధికతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు ఇద్దరికి సర్ధిచెప్పి గొడవను శాంతింపజేశారట.
వందల కోట్ల ఆస్తులు...
భారతీరాజా పేరు మీద చెన్నైలో చాలా ఆస్తులు ఉన్నాయట. టీ నగర్, నీలాంగరైతో పాటు మరో చోట ఖరీదైన భవంతులు ఉన్నట్లు సమాచారం. తేనంపేటలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌తో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నాయట. వీటి వీలువ దాదాపు ఐదు వందల కోట్లకుపైనే ఉంటుందని అంటున్నారు. ఈ ఆస్తులకు సంబంధించిన హక్కుల విషయంలో చాలా రోజులుగా కూతురు, కోడలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి






