త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | అచ్చ తెలంగాణ యాస‌లో – భోగి కోసం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ డ‌బ్బింగ్‌

శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న భోగి మూవీ సెప్టెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చ తెలంగాణ యాస‌లో అనుప‌మ సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Oct 26, 2026, 9.26 pm IST

Anupama Parameswaran | అచ్చ తెలంగాణ యాస‌లో – భోగి కోసం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ డ‌బ్బింగ్‌
Advertisement

Anupama Parameswaran |  అచ్చ తెలంగాణ యాస‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అద‌ర‌గొట్టింది. శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న మూవీ భోగి. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా న‌వంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. 1960 కాలంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దుల్లోని ఓ ప‌ల్లెటూరిలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోంది.

బొగ్గులగుట్ట‌...

బొగ్గుల గుట్ట అనే ఊరిలో దొర‌ల ఆధిప‌త్యం, అణిచివేత‌ను ఎదురించి ఓ యువ‌కుడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో ఈ మూవీ సాగ‌నుంది. ఇటీవ‌లే  ఎగిలివారంగా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట ట్రెండ్ అవుతోంది.

తెలంగాణ యాస‌లో..

భోగి షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతోన్నాయి. భోగి సినిమాకు అనుప‌మ అచ్చ తెలంగాణ యాస‌లో డ‌బ్బింగ్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

డీ గ్లామ‌ర్ పాత్ర‌లో...

భోగి సినిమాలో కందుల సులోచ‌న రాణి అనే పాత్ర‌లో అనుప‌మ క‌నిపించ‌బోతుంది. డీ గ్లామ‌ర్ రోల్ చేస్తోంది. భోగిలో అనుప‌మ‌తో పాటు డింపుల్ హ‌య‌తి మ‌రో నాయిక‌గా న‌టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement