త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేల‌కు పైగా పెరిగిన బంగారం ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల్లో జోష్‌..

Gold And Silver Prices Today | ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గ‌రిష్ట స్థాయిల‌కు చెందిన బంగారం, వెండి ధ‌ర‌లు త‌రువాత పెర‌గ‌లేదు. అప్ప‌టి నుంచి సుమారు 30 శాతం మేర క‌రెక్ష‌న్‌కు గుర‌య్యాయి. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం వంటి కార‌ణాల‌తో పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగారు.

S

Business | Published On Nov 9, 2026, 11.28 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేల‌కు పైగా పెరిగిన బంగారం ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల్లో జోష్‌..
Advertisement

Gold And Silver Prices Today | ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గ‌రిష్ట స్థాయిల‌కు చెందిన బంగారం, వెండి ధ‌ర‌లు త‌రువాత పెర‌గ‌లేదు. అప్ప‌టి నుంచి సుమారు 30 శాతం మేర క‌రెక్ష‌న్‌కు గుర‌య్యాయి. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు, అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం వంటి కార‌ణాల‌తో పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగారు. దీంతో ప‌సిడి, వెండి ధ‌ర‌లు భారీగా దిద్దుబాటుకు గుర‌య్యాయి. అయితే విశ్లేష‌కులు మాత్రం స‌మీప కాలంలో ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది రోజులుగా ఆయా లోహాల ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపిస్తోంది. అయితే అమ్మ‌కాల ఒత్తిడి అధికంగా ఉండడంతో ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక సోమ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. ఔన్స్ బంగారం ధ‌ర 1.28 శాతం పెరిగి 4,123 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.86 శాతం ఎగ‌బాకి 52 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1539 పాయింట్లు పెరిగి 1,44,091 పాయింట్ల‌కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,200 పాయింట్లు పెరిగి 1,88,300కు వ‌చ్చింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.10వేల‌కు పైగా ధ‌ర పెర‌గ్గా, వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,460 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,15,680 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,44,600 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,46,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,300 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,255 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,06,040గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,32,550 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,25,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,845 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.86,760గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,08,450 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,84,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,05,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,050గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,05,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,050 గా ఉంది.

Advertisement
Advertisement