త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | రామ్ చ‌ర‌ణ్‌కు గాయం.. నిలిచిన పెద్ది షూటింగ్

Ram Charan | మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) గాయపడ్డారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమా సెట్స్‌లో చరణ్ స్వల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి.

G

Movies | Published On Mar 25, 2026, 9.00 am IST

Ram Charan | రామ్ చ‌ర‌ణ్‌కు గాయం.. నిలిచిన పెద్ది షూటింగ్
Advertisement

Ram Charan | త్రినేత్ర‌.న్యూస్‌: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) గాయపడ్డారు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమా సెట్స్‌లో చరణ్ స్వల్పంగా గాయ‌ప‌డిన‌ట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తున్న‌ది. కానీ అది చిన్న దెబ్బేన‌ని, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని చెబుతున్నారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్‌లో చేరతారని అంటున్నారు. అభిమానులు ఆందోళ‌న చందాల్సిన సోష‌ల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

కాగా, ప్రస్తుతం చరణ్‌తో ఉన్న కీలక సన్నివేశాలను హైద‌రాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్‌ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్‌ను విడుదల చేస్తారని తెలుస్తున్న‌ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) క‌థానాయిక‌గా నటిస్తున్న‌ది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్ప‌టికే ఒక‌సారి వాయిదాప‌డిన ఈ మూవీ.. తాజాగా ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement