త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kochi | వైద్యం పేరుతో డాక్ట‌ర్‌ను ఇంటికి పిలిచి.. నిలువునా దోచుకున్న న‌టులు

Kochi | మ‌ల‌యాళ‌ ప్ర‌ముఖ న‌టి (Malayalam actress) అతుల్య చంద్ర (Athulya Chandra), మ‌రో న‌టుడు బిబిన్ పెరుంపల్లి.. అత్య‌వ‌స‌ర వైద్యం పేరుతో స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి అత‌డిని నిలువునా దోచుకున్నారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని కొచ్చిలో న‌వంబ‌ర్ 2న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వారిద్ద‌రినీ అరెస్ట్ చేశారు.

D

Movies | Published On Nov 6, 2026, 11.44 am IST

Kochi | వైద్యం పేరుతో డాక్ట‌ర్‌ను ఇంటికి పిలిచి.. నిలువునా దోచుకున్న న‌టులు
Advertisement

Kochi | త్రినేత్ర న్యూస్ : కేర‌ళ కొచ్చిలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ అని చెప్పి స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిచిన ఓ న‌టి (Malayalam actress).. కొంద‌రితో క‌లిసి అత‌డిని నిలువునా దోచుకుంది (Doctor alleges being lured). ఈ ఘ‌ట‌న న‌వంబ‌ర్ 2న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ల‌యాళ‌ ప్ర‌ముఖ న‌టి అతుల్య చంద్ర (Athulya Chandra), మ‌రో న‌టుడు బిబిన్ పెరుంపల్లితో (Bibin Perumpally) క‌లిసి స్థానిక వైద్యుడికి ఫోన్ చేసింది. ఓ వ్య‌క్తికి అర్జెంట్‌గా వైద్యం అవ‌స‌ర‌ముంద‌ని.. వెంట‌నే త‌న ప్లాట్‌కు రావాల‌ని చెప్పింది. దీంతో వైద్యుడు న‌వంబ‌ర్ 2న సాయంత్రం 6:30 గంట‌ల స‌మ‌యంలో న‌టి ప్లాట్‌కు వెళ్లాడు. అయితే, అప్ప‌టికే అక్క‌డ సుమారు 12 మంది ఉన్నారు. వైద్యుడు లోప‌లికి రాగానే వారంతా అత‌డిపై దాడి చేశారు. బెదిరించి వైద్యుడిని నిలువునా దోచుకున్నారు. ఈ విష‌యం పోలీసుల‌కు చెబితే వైద్యం చేసేందుకు వచ్చి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించారు.

అత‌డి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌, ఇయ‌ర్ ఫోన్‌.. ఇలా సుమారు 3.25 ల‌క్ష‌ల విలువైన వ‌స్తువుల‌ను దోచుకున్నారు. వారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డిన డాక్ట‌ర్‌.. క‌డ‌వంత్ర పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. న‌టి త‌న‌ని దూషించి, చంపేస్తానంటూ బెదిరించింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వైద్యుడి ఫిర్యాదు మేర‌కు అక్ర‌మ నిర్బంధం, అస‌భ్య‌క‌ర చేష్ట‌లు, గాయ‌ప‌ర‌చ‌డం, క్రిమిన‌ల్ బెదిరింపులు, దోపిడీ త‌దిత‌ర సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టులు అతుల్య‌, బిబిన్ స‌హా మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగ‌తావారి కోసం గాలింపు చేప‌డుతున్నారు. హనీట్రాప్ (honey-trap) ఆపరేషన్ అయి ఉండవచ్చనే కోణంతో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారణ చేపట్టారు. నటి అతుల్య ఉయిర్ (2026), డీస్ ఇరే, మధు వదలర, మధు వదలర 2 వంటి సినిమాల్లో న‌టించారు. బిబిన్ పెరుంపల్లి.. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన లోకః చిత్రంలో పోలీస్ అధికారిగా నటించి మంచి గుర్తింపు పొందారు.

Also Read..

కూతూరును కాపాండేందుకు చెరువులోకి దిగిన తండ్రి.. నీట మునిగి ఇద్ద‌రూ మృతి

జ‌నాల‌పైకి దూసుకెళ్లిన ట్ర‌క్కు.. ఏడుగురు మృతి

ప్రజలకు దీపావళి కానుక.. భారీగా త‌గ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర

Advertisement
Advertisement