Aishwarya Lekshmi | రూ.100కోట్లు ఇచ్చినా సోషల్ మీడియా జోలికి వెళ్లను.. తేల్చి చెప్పిన మల్లు బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి..!
Aishwarya Lekshmi | మళ్లీ సోషల్ మీడియా జోలికి వెళ్లేది లేదని మల్లు బ్యూటీ ఐశ్వర్య స్పష్టం చేసింది. గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అకౌంట్ పూర్తిగా డీయాక్టివేట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు.
Entertainment | Published On Jul 22, 2026, 8.10 pm IST
Aishwarya Lekshmi | మళ్లీ సోషల్ మీడియా జోలికి వెళ్లేది లేదని మల్లు బ్యూటీ ఐశ్వర్య స్పష్టం చేసింది. గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అకౌంట్ పూర్తిగా డీయాక్టివేట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా లేకుండా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటోందని, తిరిగి అందులోకి అడుగుపెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడింది. సోషల్ మీడియాలో ఉన్న సమయంలో తాను తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిపింది. "సోషల్ మీడియాలో ఎప్పుడూ సురక్షితంగా ఉన్నాననే భావన కలగలేదు. అది లేకుండా పని చేయడం మొదలుపెట్టాక జీవితం చాలా సులభంగా మారింది.
ద్వేషిస్తున్నారనిపించేది..
ప్రస్తుతం నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. అందుకే మళ్లీ సోషల్ మీడియాలోకి వెళ్లాలనే ఆలోచన లేదు" అని చెప్పింది. సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్, మార్ఫింగ్ చేయడం తనపై తీవ్రంగా ప్రభావం చూపాయని ఆమె వెల్లడించింది. "నా ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసేవారు. అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసేవారు. అలాంటి పోస్టులు, కామెంట్లు పదేపదే కనిపించడంతో అందరూ నన్ను ద్వేషిస్తున్నారేమో అన్న భావన కలిగేది. అది నా మానసిక ప్రశాంతతను దెబ్బతీసింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా అభిమానులను, ప్రజలను కలవడం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది" అని చెప్పింది. తన నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లోనూ మారదేని చెప్పింది. "ఎవరైనా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పినా సోషల్ మీడియా వైపు వెళ్లను. డబ్బు కోసం నా ప్రశాంతతను కోల్పోవాలనుకోవడం లేదు" అని వ్యాఖ్యానించింది.
వరుణ్‌కు జోడీగా..
ఐశ్వర్య లక్ష్మి మలయాళ చిత్ర పరిశ్రమలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నది. 2017లో విడుదలైన 'న్జండుకలుడే నాట్టిల్ ఒరిడవేళ' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత 'మాయానది', 'వరతన్', 'అర్చనా 31 నాట్ అవుట్', 'కుమారి', 'కింగ్ ఆఫ్ కొత' వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మలయాళంతో పాటు తమిళ, తెలుగులోనూ అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్' తొలి, రెండో భాగాల్లో పూంగుళళి పాత్రలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఇటీవల 'గట్టా కుస్తీ', 'జగమే తంత్రం' వంటి తమిళ చిత్రాలతో పాటు పలు భిన్నమైన కథాంశాలున్న సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు (SYG)' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు మలయాళంలోనూ మరికొన్ని ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






