Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..
Stock Markets | అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.65 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 50 దాదాపు స్థిరంగా ప్రారంభమైంది. ముఖ్యంగా అమెరికా టెక్నాలజీ షేర్ల పతనం, కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడులపై ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి.
Stock Markets | అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 103.65 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 50 దాదాపు స్థిరంగా ప్రారంభమైంది. ముఖ్యంగా అమెరికా టెక్నాలజీ షేర్ల పతనం, కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడులపై ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి.
భారీ అమ్మకాల ఒత్తిడి..
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 79,413.66 పాయింట్ల వద్ద ప్రారంభమై, గత ముగింపుతో పోలిస్తే 103.65 పాయింట్లు (0.13 శాతం) లాభపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 24,538.20 పాయింట్ల వద్ద ప్రారంభమై 1.60 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా పెరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్లలోని ఇతర విభాగాలపై కనిపించింది. నిఫ్టీ 100 సూచీ 0.11 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.87 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.54 శాతం నష్టపోయాయి.
భారీగా పడిపోయిన అమెరికన్ టెక్ షేర్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లు భారీగా పడిపోవడంతో అక్కడి ప్రధాన సూచీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా నాస్‌డాక్ సూచీ 5.6 శాతం పతనం కావడం అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. డేటా సెంటర్లపై భారీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు, డెమోక్రాట్ల నుంచి భారీ డేటా సెంటర్ పెట్టుబడులకు వ్యతిరేకత వ్యక్తమవుతుండడం ఈ పతనానికి కారణాలుగా నిలిచాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న ఈ ప్రతికూల ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.
ఈ పరిణామాలపై జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ స్పందిస్తూ.. అమెరికా మార్కెట్లలో నెలకొన్న భారీ పతనం ప్రపంచంలోని చాలా మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయితే భారత మార్కెట్లు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశముందని తెలిపారు. అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం, ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడుల జోరు తగ్గడం భారత మార్కెట్లకు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | సెన్సెక్స్ 2,000 పాయింట్లు జంప్.. 24,500 దాటిన నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
నవంబర్ 5, 2026

FII Buying | భారత మార్కెట్లకు పోటెత్తుతున్న విదేశీ పెట్టుబడులు.. అత్యధికంగా కొంటున్న స్టాక్స్ ఇవే..
నవంబర్ 5, 2026

Indian Stock Markets | మదుపర్లపై కనక వర్షం.. 6 రోజుల్లో రూ.28 లక్షల కోట్లు లాభం..
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్
- ●Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు
- ●Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య
- ●Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం
- ●Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డ్
- ●Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్

Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్

Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు

Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య

Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం



