Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు
Unaccounted Cash | ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై భయంభయంగా తిరుగుతున్నాడు. అనుమానం రావడంతో రైల్వే పోలీసులు (Railway Police) అతని వద్ద ఉన్న బ్యాగులను (Unaccounted Cash) తనిఖీ చేశారు. వాటిలో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతయింది.
Unaccounted Cash | త్రినేత్ర న్యూస్: ఓ వ్యక్తి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై భయంభయంగా తిరుగుతున్నాడు. అనుమానం రావడంతో రైల్వే పోలీసులు (Railway Police) అతడిని ప్రశ్నించారు. సమాధానమిచ్చేందుకు తడబడుతుండటంతో అతని వద్ద ఉన్న బ్యాగులను (Unaccounted Cash) తనిఖీ చేశారు. వాటిలో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోవడం వారి వంతయింది.
జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలు జార్ఖండ్‌లోని టాటా నగర్ (Tatanagar) నుంచి హౌరా వెళ్తున్నది. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మండీపూర్ జిల్లా ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. అందులో నుంచి రాహుల్ సోనీ (Rahul Soni) అనే 36 ఏండ్ల వ్యక్తి దిగాడు. చేతిలో రెండు బ్యాగులు, భుజానికి మరో బ్యాగు (బ్యాక్‌ప్యాక్)తో 7వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. గమనించిన రైల్వే పోలీసులు (GRP) అతని దగ్గరకు వెళ్తుండగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన జీఆర్పీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బ్యాగుల్లో నోట్ల కట్టలు
అతని వద్ద ఉన్న బ్యాక్ ప్యాక్ (Backpack), రెండు హ్యాండ్‌బ్యాగులను తనిఖీ చేశారు. వాటిలో రూ.500 నోట్లతో కూడిన 280 కట్టలు బయటపడ్డాయి. దీంతో కౌంటింగ్ యంత్రం తెప్పించిన పోలీసులు.. ప్లాట్‌ఫామ్‌పైనే (Railway Platform) వాటిని లెక్కించారు. దీంతో వాటి విలువ రూ.1.40 కోట్లుగా తేలింది. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ హవాలా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయడానికి ఆదాయపు పన్ను (Income Tax) శాఖకు సమాచారం అందించారు. కాగా, నగదును తాను టాటానగర్ నుంచి హౌరా తీసుకెళ్తున్నానని నిందితుడు పోలీసులకు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hafizpet | మహిళను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్
సెప్టెంబర్ 19, 2026

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
జులై 26, 2026

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
జులై 6, 2026
తాజావార్తలు
- ●Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య
- ●Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం
- ●Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డ్
- ●Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్
- ●Horoscope | నవంబర్ 6 రాశిఫలాలు.. మీ సేవలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది!
- ●Invest Telangana Global Summit 2026 | ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ : డిసెంబర్ 7 నుంచి 9 వరకు సమ్మిట్

Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య

Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం

Nithya Raman | లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్.. తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డ్

Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్



