త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా త‌గ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. మెట్రో-ఆర్టీసీ (Metro RTC Common Pass) ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరలను భారీగా తగ్గించ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు నెల‌వారీ ఉమ్మ‌డి పాస్ (Monthly Pass) ధ‌ర రూ.8500గా ఉండగా.. దానిని రూ.4,000కు త‌గ్గించింది.

G

Telangana | Published On Nov 6, 2026, 10.40 am IST

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా త‌గ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర
Advertisement

Metro RTC Common Pass | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. మెట్రో-ఆర్టీసీ (Metro RTC Common Pass) ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరలను భారీగా తగ్గించ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు నెల‌వారీ ఉమ్మ‌డి పాస్ (Monthly Pass) ధ‌ర రూ.8500గా ఉండగా.. దానిని రూ.4,000కు త‌గ్గించింది. అదేవిధంగా ప్ర‌స్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మ‌డి పాస్ ధ‌ర‌ను రూ.275కు త‌గ్గించింది. ఈమేర‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భ‌ట్టివిక్ర‌మార్క‌ ఆదేశాలతో మెట్రో, ఆర్టీసీ ఉమ్మ‌డి ప్ర‌యాణ‌ పాస్ ధరను తగ్గించినట్లు తెలిపారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ధ‌ర‌లు న‌వంబ‌ర్ 8 నుంచి అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెప్పారు.

`రాష్ట్ర ప్రజలకు దీపావళి (Diwali) కానుకగా మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.

ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించాం. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు తగ్గించాం. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్టంగా 50 సింగిల్ ట్రిప్పులకు మెట్రోలో అనుమతి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఎలాంటి పరిమితులు ఉండవు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుంది. రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుంది.

8 నుంచి అమ‌ల్లోకి..

మా ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించాం. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మేము తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని విశ్వసిస్తున్నాను.` అని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement