Mangli | రూ.10 కోట్లు మోసం.. సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
Mangli | ప్రముఖ గాయని మంగ్లీ (Mangli) మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను రూ.10 కోట్లు మోసం చేశారని, మంగ్లీతోపాటు ఆమె సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Mangli | త్రినేత్ర.న్యూస్: ప్రముఖ గాయని మంగ్లీ (Mangli) మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను రూ.10 కోట్లు మోసం చేశారని, మంగ్లీతోపాటు ఆమె సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు వారిద్దరితోపాటు మరో ముగ్గురిపై బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింది కేసులు నమోదుచేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, ఓ సినిమాలో బూతు పాట పాడటంతో ఆమెపై ముంబైకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేశారు. కన్నడ హీరో ధ్రువ సర్జా నటించిన పాన్ ఇండియా మూవీ కేడీ: ది డెవిల్ (KD: The Devil)లో సర్కే చునర్ (Sarke Chunar) అనే పాట హిందీ వర్షన్‌ని మంగ్లీ పాడారు. అయితే శృంగారాన్ని వర్ణిస్తూ వాడిన పదజాలం అత్యంత అసభ్యకరంగా, ద్వందార్థాలతో ఉందని, సాహిత్యం, దృశ్యాలు సమాజంపై ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తన ఫిర్యాదులో వినీత్ జిందాల్ పేర్కొన్నారు.
ఇక గతేడాది జూన్ 11న అనుమతి లేకుండా చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో బర్త్‌డే వేడుకలు జరుపుకోవడంతో పోలీసులు మంగ్లీపై కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతులూ లేకుండా పుట్టిన రోజు పార్టీ నిర్వహించడం, మద్యం సరఫరా చేయడం, గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడడంతో మంగ్లీ సహా నలుగురిపై కేసు ఫైల్ చేశారు.
సంబంధిత వార్తలు

Mangli | నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు – కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ మంగ్లీ
ఏప్రిల్ 12, 2026

Venu Udugula | ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు – మంగ్లీ కేసుపై డైరెక్టర్ వేణు ఊడుగుల రియాక్షన్
ఏప్రిల్ 11, 2026

Nora Fatehi | సర్కే చునర్ సాంగ్ వివాదం.. నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ చివరి ఛాన్స్..!
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



