త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వ‌న‌మే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్ట‌ప‌ల్లి’ బ‌తుక‌మ్మ పాట ఆవిష్క‌ర‌ణ‌

Bathukamma Song in Dubai | తెలంగాణ పండ‌గ‌ల‌ను ఒదిలి దుబాయ్‌లో బ‌తుకీడుస్తున్న‌ వ‌ల‌స కార్మికుల అన్నాచెల్లెళ్ల గోసకు అక్ష‌ర బాణీలిచ్చారు ప్ర‌జా క‌వి, గాయకుడు మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్‌.

S

Telangana | Published On Oct 17, 2026, 6.04 pm IST

Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వ‌న‌మే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్ట‌ప‌ల్లి’ బ‌తుక‌మ్మ పాట ఆవిష్క‌ర‌ణ‌
Advertisement
  • ఆడబిడ్డలకు అంకితమిచ్చిన‌ అక్షర గ్రూప్స్ చైర్మన్ కోట కుమార్

Bathukamma Song in Dubai | త్రినేత్ర న్యూస్: తెలంగాణ పండ‌గ‌ల‌ను ఒదిలి దుబాయ్‌లో బ‌తుకీడుస్తున్న‌ వ‌ల‌స కార్మికుల అన్నాచెల్లెళ్ల గోసకు ర‌మ‌ణీయ‌మైన బాణీలిచ్చారు ప్ర‌జా క‌వి, గాయకుడు మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్‌. ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో.. అంటూ సాగే బతుకమ్మ పాటని శ‌నివారం దుబాయ్‌లో అట్ట‌హాసంగా ఆవిష్క‌రించారు. సొంతూరిలో పండగ జరుపుకోలేని తెలంగాణ ఆడ బిడ్డలకు, అన్నదమ్ములకు మధుర స్మృతులను మిగిల్చేలా ఈ తీయ‌ని గీతం అందించారు.

సొంత ఊరిలో పండుగ జరుపుకోవాలని ప్ర‌తి తెలంగాణ బిడ్డ ఎంత ఆరాట‌మో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. గల్ఫ్ లో బతుకు పోరు రీత్యా అయిన వాళ్ళ మధ్య బ‌తుక‌మ్మ వేడుక‌లు జరుపుకోలేని తెలంగాణ ఆడ బిడ్డలు, అన్నదమ్ముల్లో ఈ పాట ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఈ పాటలోని సాహిత్యం దూదు సేమియాకు సత్తు బెల్లానికి కలిపిన బంధం.. కర్జూర తీపికి బతుకమ్మ బాణీకి అద్దిన మాధుర్యం క‌ట్టిప‌డేస్తోంది. రెండు మతాల మధ్య, రెండు విభిన్న సంప్రదాయాల మధ్య ఉన్న సామరస్యాన్ని, అనుబంధాన్ని దుబాయ్ వేదికగా గల్ఫ్ నుంచి గళమెత్తి వినిపించారు.

హిందూ-ముస్లిం భాయి భాయి అని సరికొత్తగా బతుకమ్మ పాట రూపంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్ర‌తిబింబించారు. దుబాయ్ బతుకమ్మ పాటని గోలుకొండ‌ కోట నుంచి బూర్జు ఖలీఫా దాకా ఏడు దేశాలను ఏడు రంగుల లెక్క అద్ది బూర్జు ఖలీఫా అంత ఎత్త‌యిన బతుకమ్మ పాటను పేర్చారు. మిట్టపల్లి స్టూడియో ద్వారా అక్షర గ్రూప్స్ చైర్మన్ కోట కుమార్ ఇటు తెలంగాణ.. అటు గల్ఫ్ లో ఉన్న ఆడబిడ్డలకు పాటను అంకితమిచ్చారు.

అక్షర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెల్ల‌రి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కోట కుమార్ (కె కె) ఈ పాట‌ను నిర్మించగా.. ఈ గీతానికి ప్రముఖ తెలంగాణ ప్రజా కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ ఆలపించగ నేపథ్య‌ సంగీతం మదీన్ ఎస్కే సమకూర్చారు.

స్పార్క్ మీడియా, సుతారి సత్యం మల్లేష్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి సంప్రదాయ వాయిధ్యాలైన డప్పు బృందాలు, ఒగ్గు డోలు బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అబుదాబి నుంచి సైతం పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని బతుకమ్మ పండగను విజయవంతం చేశారు.

Advertisement
Advertisement