Nora Fatehi | ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి
Nora Fatehi | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ తనపై వచ్చిన ఆరోపణలు, రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఎదురైన వివాదం తనను తీవ్రంగా మానసికంగా వేధించిందని బాలీవుడ్ నటి నోరా ఫతేహి వెల్లడించింది. ‘డ్రీమ్ విత్ డాక్టర్ షీన్’ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశను గుర్తుచేసుకుంది. ఈ
Entertainment | Published On Aug 27, 2026, 1.50 pm IST
Nora Fatehi | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ తనపై వచ్చిన ఆరోపణలు, రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఎదురైన వివాదం తనను తీవ్రంగా మానసికంగా వేధించిందని బాలీవుడ్ నటి నోరా ఫతేహి వెల్లడించింది. ‘డ్రీమ్ విత్ డాక్టర్ షీన్’ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశను గుర్తుచేసుకుంది. ఈ వివాదం కారణంగా తాను బ్రాండ్స్, సినిమా, ఇతర వృత్తిపరమైన అవకాశాలను కోల్పోయానని నోరా తెలిపింది. ఏజెన్సీ ఏదైనా ఈవెంట్‌కు బుక్ చేసినప్పటికీ ఇప్పటికీ భయపడుతుంటానని చెప్పింది. తనపై ప్రచారమైన కొన్ని కథనాలు వాస్తవం కాదని స్పష్టం చేసింది.
ఏళ్ల కష్టం ఒక్కసారిగా పోయింది..
కెరీర్‌లో దశాబ్దాలుగా కష్టపడి సాధించిన అవకాశాలు ఒక్క వివాదంతో చేజారిపోవడం తనను తీవ్రంగా బాధించిందని నోరా పేర్కొంది. సుకేశ్‌తో వ్యక్తిగత పరిచయం, ప్రేమ సంబంధం ఉందని, అతడి నుంచి వ్యక్తిగత ప్రయోజనాల కోసం గిఫ్ట్స్ తీసుకున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించింది. ఈ తప్పుడు కథనాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని తెలిపింది. ఈ వివాదం సమయంలో తాను ఒంటరిగా ఉన్నానని.. గందరగోళంగా భావించానని నోరా చెప్పింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పుకుంటూ పోవడంతో చాలాకాలం గడిచిపోయిందని, తనతో చాలా క్రూరంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
2018 నుంచి 2023 వరకు..
2018 నుంచి 2023 వరకు తాను విషపూరిత పరిస్థితులను ఎదుర్కొన్నానని నోరా ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన విషయాలను బయటకు చెప్పకుండా ఉండటానికి కారణం.. తాను చెప్పేది ఎవరూ నమ్మరేమోనన్న భయమేనని పేర్కొంది. 2024లోనే క్రమంగా తనను తాను పునర్నిర్మించుకోవడం, ఆ అనుభవం నుంచి బయటపడటం ప్రారంభించానని చెప్పింది. తన వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు పూర్తిగా తెలియదని నోరా పేర్కొంది. మీడియా, సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో తన గురించి కనిపించే ప్రతీ విషయాన్నీ నిజమని నమ్మవద్దని సూచించింది. భవిష్యత్తులో ఆన్‌లైన్‌లోని తప్పుడు కథనాలు వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేసింది.
నా పదేళ్ల ప్రయాణాన్ని తగ్గించేశారు..
మరో వివాదం కారణంగా తన దశాబ్ద కాలం కెరీర్‌ను ఒకే కోణంలో చూపించారని నోరా ఆరోపించింది. తాను కేవలం అసభ్యకరమైన డ్యాన్స్‌లు చేసే వ్యక్తిని అన్నట్లుగా చిత్రీకరించడం తన కెరీర్ ప్రయాణాన్ని అవమానించడమేనని పేర్కొంది. ఒకే కథనంతో తన పదేళ్ల కష్టాన్ని విలువలేనిదిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈ అనుభవాలన్నింటి నుంచి తన నమ్మకాలు, విధిరాతపై విశ్వాసమే తనను ముందుకు నడిపించాయని నోరా చెప్పింది. తనకు దక్కాల్సినది ఎవరూ దూరం చేయలేరని, తన నుంచి వెళ్లిపోయినది తనకు మంచిది కాకపోవచ్చని భావిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పుకొచ్చింది.
సర్కే చునార్ తేరీ వివాదంపై స్పందన..
కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’లోని ‘సర్కే చునార్ తేరీ’ సాంగ్ వివాదంపై సైతం నోరా స్పందించింది. హిందీ వెర్షన్ విషయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె తెలిపారు. తన అనుమతి లేకుండానే పాటను హిందీలో డబ్ చేయడంతో దర్శకుడికి అభ్యంతరం చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ఈ పాట వివాదం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. వివాదాన్ని మరింత పెంచేందుకు కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసంటూ వ్యాఖ్యానించింది. పాటను హిందీలోకి మార్చడం, సాహిత్యాన్ని డబ్ చేయడం వంటి ఏ విషయానికీ తన సమ్మతి తీసుకోలేదని నోరా స్పష్టం చేసింది. తన ఇమేజ్, ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని దర్శకుడికి ముందే చెప్పినట్లు చెప్పింది. అందుకే సాంగ్‌కు తాను ఎక్కడా ప్రచారం చేయలేదని గుర్తు చేసింది. సంజయ్ దత్, నోరా ఫతేహి నటించిన ఈ పాటలోని సాహిత్యంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో.. దాన్ని అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు – ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
ఆగస్టు 27, 2026

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ – అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
ఆగస్టు 20, 2026

Pooja Hegde | ప్రియుడిని పెళ్లాడనున్న బుట్టబొమ్మ – రూమర్లపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!
- ●Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి
- ●Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
- ●Ramchandar Rao | విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే.. వారి గూంజ్ కాంగ్రెస్‌కు వినిపిస్తలేదు
- ●Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం

Janhvi Kapoor | బాలీవుడ్ హీరోతో జాన్వీ కపూర్ పెళ్లంటూ రూమర్లు - ఫొటోల వెనకున్న అసలు ట్విస్ట్ ఇదే!

Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?

Aircraft Crashes | కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి

Type 2 Diabetes | డయాబెటిస్ ఉన్న మహిళలకు మానసిక ఆరోగ్య సమస్యల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..



