Mangli | నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు – కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ మంగ్లీ
మైక్రో ఫైనాన్స్ మోసాలకు సంబంధించి తనపై వస్తోన్న ఆరోపణలపై సింగర్ మంగ్లీ స్పందించింది. తాను ఏ తప్పూ చేయలేదని అన్నది. అసత్య ఆరోపణలతో తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని అన్నది.
Entertainment | Published On Apr 12, 2026, 6.45 pm IST
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాల పేరుతో తనపై వస్తోన్న ఆరోపణలపై సింగర్ మంగ్లీ రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా తనకు శాపంగా మారిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనను లాయర్ సుబ్బారావు అనుచిత వ్యాఖ్యలతో దూషించాడంటూ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీ కంప్లైంట్ ఇచ్చారు. తన గురించి అసత్యాలు ప్రచారం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంగ్లీ ఎమోషనల్ అయ్యింది. తనపై ఆరోపణలు చేసేముందు నిజానిజాలేమిటో తెలుసుకుంటే బాగుంటుందని అన్నది.
శాపంగా మారింది....
సోషల్ మీడియా నుంచే వచ్చాను. అదే నాకు శాపంగా మారుతుందని ఏ రోజు అనుకోలేదు. చీటింగ్ కేసులో నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఏం లేదు. ఫేమస్ అవ్వడానికే నాపై ఆరోపణలు చేస్తున్నారు. నిందలు వేసి నన్ను నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. కొందరి పోగ్రామ్‌లకు వెళ్లకపోవడంతో నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు బలుపు అంటూ, ఓవర్ యాక్షన్ చేస్తున్నానంటూ విమర్శించారు. కష్టాన్ని పాటను నమ్ముకొని ముందుకు సాగుతున్నా.గతంలో నాపై పార్టీ మనిషి అంటూ ముద్రలు వేశారు. దాంతో కొన్నాళ్లు పాటలు పాడటం మానేశాను అంటూ మంగ్లీ అన్నది.
మంగ్లీపై కేసు...
మైక్రో ఫైనాన్స్ పేరుతో సింగర్ మంగ్లీ పది కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారని, అడిగితే చంపేస్తానని బెదిరించారని సింగర్ మంగ్లీ , ఆమె సోదరుడితో పాటు మరికొందరిపై లాయర్ సుబ్బారావు కేసు పెట్టారు. ఈ కేసులో డైరెక్టర్ వేణు ఊడుగులకు సంబంధం ఉందంటూ ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై వేణు ఊడుగుల రియాక్ట్ అయ్యారు. తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అన్నారు.
సంబంధిత వార్తలు

Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ – నాగార్జున హీరో – రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ…
ఆగస్టు 4, 2026

Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే – బ్లడీ రోమియోతో రొమాన్స్
ఆగస్టు 4, 2026

Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?
- ●RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ●Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?
- ●TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ
- ●King Cobra | ఏం పిల్లరా బాబు.. నాగుపామును అలా పట్టేసింది.. వీడియో
- ●Nagarjuna | బాలకృష్ణ ప్రొడ్యూసర్ - నాగార్జున హీరో - రేర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ కానీ...

Lockup Season 2 | యాభై మిలియన్ల వ్యూస్‌తో లాకప్ సీజన్ 2 రికార్డ్ - ఫైనల్‌కు ముందే విన్నర్ పేరు లీక్?

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

Phone Tapping Case | సీఎం గారూ మీ ఫోన్ ట్యాప్ అయిందా..?

TVS | 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి సభ



